Veligonda: వెలిగొండపై నిమ్మల ఫోకస్.. జూన్ 2026లో ప్రాజెక్టు పూర్తి!

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

Update: 2026-04-07 11:47 GMT

Veligonda: వెలిగొండపై నిమ్మల ఫోకస్.. జూన్ 2026లో ప్రాజెక్టు పూర్తి!

Veligonda: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో రెండు గంటల పాటు ప్రయాణించి, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ల పనులను చూశారు. అత్యంత క్లిష్టమైన టన్నెల్స్‌లో మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని సమీక్షించారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద నిలిచిపోయిన టిబిఎం యంత్రాన్ని కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి విమర్శలు చేశారు. పూర్తికాకముందే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని ఆరోపించారు. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటర్ పనుల్లో 70 శాతం పూర్తయ్యాయని, టన్నెల్-2లో మిగిలిన పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫీడర్ కెనాల్ పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్వాసితులకు ఏప్రిల్ నుంచి ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టిన విధంగా 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News