Jadupudi RS: పోలమ్మ తల్లి జాతర.. భక్తజన సంద్రమైన అమ్మవారి సన్నిధి!
Jadupudi RS: కవిటి మండలం జాడుపూడి ఆర్‌ఎస్‌లో ఘనంగా పోలమ్మ తల్లి, భూలోకమాత సంబరాలు.
Jadupudi RS: పోలమ్మ తల్లి జాతర.. భక్తజన సంద్రమైన అమ్మవారి సన్నిధి!
Jadupudi RS: కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్ లో పోలమ్మతల్లి, భూలోకమాత సంబర మహోత్సవాన్ని మంగళవారం సందడిగా నిర్వహించారు. ఇందులో భాగంగా బెలగాం ఎంపీటీసీ ప్రతినిధి సంతోష్ పట్నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలో భాగంగా ఉదయం నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, ఆర్ బెలగాం కోలాట బృందం నృత్య ప్రదర్శన, తీన్మార్ డప్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులు అమ్మవారి పాదాలు కడిగి పునీతులయ్యారు. ఇందులో భాగంగా బెలగాం ఎంపీటీసీ ప్రతినిధి సంతోష్ పట్నాయక్ తలపై ఘటాన్ని ఊరేగించి అమ్మవారి సన్నిధిలో ఉంచారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం పోలమ్మతల్లి ఆలయ సన్నిధిలో భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జాడుపూడి ఆర్ఎస్ లో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది.