Vizag: ఉద్యోగుల రెగ్యులరైజేషన్ హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే!

Vizag: తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్.

Update: 2026-04-07 12:06 GMT

Vizag: ఉద్యోగుల రెగ్యులరైజేషన్ హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే!

Vizag: దశాబ్దాలుగా తాత్కాలిక ప్రతిపదికపై తక్కువ వేతనాలతో ఉద్యోగులతో పని చేయించుకోవడం శ్రమ దోపిడీ అని, తెలుగు గంగ, ప్రాజెక్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునివ్వడాన్ని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ హార్షం వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికపై రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇవ్వడంపై హైకోర్టు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో గతంలో సమాన పలుకు సమాన వేతలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నేటికీ ఎక్కడ అమ్ములు నోచుకోలేదని . అత్యున్నత న్యాయస్థానం తీర్పులను. చట్టాలను అమలు చేయాల్సిన పాలకులు ప్రభుత్వం కార్మిక ఉద్యోగ లు శ్రమను గుర్తించకుండా. ప్రభుత్వా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు ఉన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వివిధ తాత్కాలిక ఉద్యోగులైన మూడు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, జీవీఎంసీ విఎంఆర్డిఏ.ఆర్టిసీ, మెడికల్, హార్టికల్. అగ్రికల్చర్. పంచాయతీ రాజ్. గిరిజన కార్పొరేషన్. టూరిజం. దేవాదాయ,వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ లో, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న లక్ష మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, దాదాపు 40 వేల మంది ఎన్ఎంఆర్, కంటింజెంట్, పార్టెమ్ కంటింజెంట్, డైలీవేజ్, హాస్టల్ డైలీవేజ్ తదితర తాత్కాలిక ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్లోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

గౌరవ వేతనం తదితర పేర్లతో అంగన్వాడీలను, ఆశాలను, మధ్యాహ్నభోజన పథకo 108. 104. . కార్మికులను, వెలుగులో విఓఏ లతో, మెప్మాలో ఆర్పీలతో, గ్రామపంచాయతీ, స్వచ్ఛభారత్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్,ను నామమాత్రపు వేతనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పని చేయించుకుంటోంది. వీరందర్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఎఐటియుసి డిమాండ్ చేస్తున్నది.

Tags:    

Similar News