Karimnagar: ఘనంగా ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్థంతి వేడుకలు

Karimnagar: మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా సదాశివపల్లిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు.

Update: 2026-04-09 08:19 GMT

Karimnagar: ఘనంగా ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్థంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా: మంత్రి, దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి 14 వ వర్థంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా సదాశివపల్లి చౌరస్తా వద్ద కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్, చింతకుంట విజయరమణా రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలుగునూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ముద్దసాని దామోదర్ రెడ్డి టిడిపి నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసమే పని చేసిన వ్యక్తి దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి అని గుర్తు చేశారు.

Tags:    

Similar News