Gajwel: ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్కడ? వెంకటాయపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
Gajwel: గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.
Gajwel: ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్కడ? వెంకటాయపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
Gajwel: మా ఉరికి మాజీ సీఎం గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ వచ్చాడు మా సమస్యలు అన్ని తీరిపోతాయి అంటూ తూప్రాన్ మండల పరిధిలోని వెంకటాయపల్లి పిటి గ్రామ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పూలమాలవేసి ఘన స్వాగతం పలికి విన్నూత్న నిరసన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తికి కేసీఆర్ వేషం వేసి మా ఉరికి కేసీఆర్ వచ్చాడు మా సమస్యలు తీర్చండి మా ఎమ్మెల్యే గారు అంటూ గ్రామస్థులు మహిళలు నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మిమ్మల్ని ఎమ్మెల్యే గా గెలిపించిన పాపానికి మా కర్మ అంటూ మా మండలంలో ఉన్న సమస్యలను తీర్చాలని కోరారు.
గజ్వేల్ అభివృధి విషయం మా ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించండి అంటూ హెద్దేవ చేశారు.ఈ సందర్భంగా 18 రకాల సమస్యలతో కూడిన వినతి పత్రం ఆయనకు అందజేశారు.తూప్రాన్ నియోజకవర్గ ఏర్పాటు,బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్రిడ్జ్ ఏర్పాటు లేక గంటల తరబడి ట్రాఫిక్ అలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంపీ దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి ఏర్పాటు కృషి చేయాలని కోరారు.ఇలా 18 రకాల సమస్యలు మీకు ప్రత్యక్షంగా తెలుపుదాం అంటే మాకు అందుబాటులో లేరు కాబట్టి ఇలా అయిన మీ దృష్టికి చేరుతాయి మా సమస్యలు తీరుతాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అని అన్నారు.