Nellore: నెల్లూరులో పోషణ్ పక్షవాడా ప్రారంభం.. పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

Nellore: నెల్లూరు జిల్లాలో 8వ పోషణ్ పక్షవాడా కార్యక్రమాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు.

Update: 2026-04-09 08:02 GMT

Nellore: నెల్లూరులో పోషణ్ పక్షవాడా ప్రారంభం.. పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

Nellore: చిన్నారుల జీవితంలోని మొదటి ఆరు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైనవని, ఈ దశలో సరైన పోషణ, సంరక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.

బుధవారం తన ఛాంబర్ నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ పోషణ్ పక్షవాడా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

ఈ సంవత్సరం పోషణ్ పక్షవాడా కార్యక్రమాలు ఏప్రిల్ 9 నుండి 23 వరకు “సహీ పోషణ్, దేశ్ రోషన్” అనే నినాదంతో నిర్వహించబడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తల్లి, శిశు పోషణ, 0–3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధికి ప్రారంభ ప్రేరణ, 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల ఆధారిత ప్రారంభ విద్య, స్క్రీన్ టైమ్ తగ్గింపులో తల్లిదండ్రులు సమాజం పాత్ర, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి సమాజ మద్దతు వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, అంగన్వాడీ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు.

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఐసీడీఎస్ పిడీ హేనా సుజన్ ను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో ప్రతి లబ్ధిదారునికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుజాత, ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ అనురాధ, అధికారులు, జిల్లా స్థాయి అధికారులు మరియు ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News