Nellore: సైదాపురంలో గిరిజన దంపతుల కిడ్నాప్.. ఇటుక బట్టీ యజమాని అరాచకం!
Nellore: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో దారుణం జరిగింది. అనారోగ్యం కారణంగా పని మానేసి వచ్చిన గిరిజన దంపతులను ఇటుక బట్టీ యజమాని, అతని కుమారులు కిడ్నాప్ చేశారు.
సైదాపురం: నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం ఎమ్మెస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది... స్థానికంగా నివాసముంటున్న గిరిజన దంపతులు మల్లికా అంకయ్య , మల్లికా పద్మమ్మ బ్రతుకుతెరువు కోసం అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు పక్కన రామిరెడ్డి గారి పల్లిలో మూడు నెలల క్రితం యజమాని శ్రీహరం వెంకటేష్ వద్ద పనులకు వెళ్లారు. భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో.. సొంత ఊరికి తిరిగి వెళ్తామని యజమానికి చెప్పినప్పటికీ, అందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో, మల్లికా అంకయ్య ,మల్లికా పద్మమ్మ లు, ఆరో తారీఖున రాత్రి సమయంలో బయలుదేరి సొంత ఊరు సైదాపురం కి చేరుకున్నారు.
అది జీర్ణించుకోలేని యజమాని ఆగ్రహం తో రైల్వేకోడూరు ఇటుకురాయి బట్టి యజమాని శ్రీహరి వెంకటేష్ , అతని ఇద్దరు కొడుకులు సురేంద్ర , అశోక్, లతో కలిసి, సైదాపురం బస్టాండ్ ప్రాంతంలోని తిరుమల మిల్క్ డైరీ షాప్ వద్ద కిడ్నాప్ చేశారు.గొడవ చేస్తే చంపేస్తామని బెదిరించి తీసుకెళ్ళారు... ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న దంపతులు, విషయం స్థానిక సిపిఎం నేతలకు తెలిపారు. దీంతో బాధితులతో కలిసి దంపతులకు న్యాయం చేయాలంటూ సైదాపురం పోలీస్ స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కిడ్నాప్ కు పాల్పడిన యజమానిని అదుపులోకి తీసుకొని శిక్షించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.