Nellore: అద్భుత 'సూత్రకళ'.. గిన్నిస్ రేసులో నెల్లూరు ఉపాధ్యాయుడు!

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య అద్భుత సృష్టి. దారంతో కళారూపాలను రూపొందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రేసులో నిలిచారు.

Update: 2026-04-08 04:57 GMT

Nellore: అద్భుత 'సూత్రకళ'.. గిన్నిస్ రేసులో నెల్లూరు ఉపాధ్యాయుడు!

Nellore: ఆయన చేతులు నల్లటి బోర్డు మీద తెల్లని అక్షరాలను మాత్రమే కాదు.. ఆ చేతులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. రికార్డులు బద్దలు కొడుతున్నాడు.. అలాగని ఆయనేం ఒలంపిక్స్ క్రీడాకారుడు కాదు.. కేవలం ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మాత్రమే.. మన భాషలో చెప్పాలంటే ఓ బడిపంతులు.. ఆయన చేసే అద్భుతాలు చూసి బడిలోని పిల్లలే కాదు యావత్ ప్రపంచమే నివ్వెర పోతుంది..

పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా ..సమయం దొరికిన సందర్భాలలో చదువుతో పాటుగా, పిల్లలకు భారతదేశంలో ఎక్కడా చూడనటువంటి కళారూపాలను, దారంతోటి ఎలా చేయాలో నేర్పిస్తు మెట్ట ప్రాంతం నుండి వచ్చాడని చిన్న చూపు చూసిన వారందరూ.. ఇప్పుడు విజ్ఞానంలో ఆయన దిట్ట అంటూ... గ్రామస్తులతో పాటు, తను విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రాంతం వాసులు కూడా మెచ్చుకునేలా ముందుకు సాగుతున్నాడు.. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాల్టీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ , ఇలా పలు అవార్డులు అందుకుని మరలా , గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు... ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు.. ఆయన చేసే విశేషాలు ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి సూత్రకళ నైపుణ్యం అంటారు.. ఇంతకీ ఏమిటా సూత్రకళ ? ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా..? ఆయన చేత్తో దారం పట్టుకుంటే చాలు , అద్భుత చిత్రాలు రూపుదిద్దుకుంటాయి . దేవతామూర్తులు,రాజులు, రాజకీయ నాయకుల చిత్రాలను దారంతో తయారు చేసే కళానైపుణ్యంలో ఆయనది అందెవేసిన చేయి.

అయితే ఎలా తయారు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదివేయండి మీ హెచ్ఎంటీవీ యాప్ లో..

నెల్లూరు జిల్లాలో నెల్లూరు-కడప సరిహద్దు మెట్ట ప్రాంత మండలమైన మర్రిపాడు మండలంలోని కంప సముద్రం గ్రామానికి చెందిన రచయిత్రి మొల్ల గారి 14వ సంతానమైన డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య చిన్నతనంలో ఉంటే విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటూ 13 డిగ్రీలు పట్టాలు పూర్తి చేశాడు.. అలాగే నాలుగు డాక్టరేట్ లు కూడా యూనివర్సిటీల ద్వారా అందుకున్నారు. అనంతరం నెల్లూరు సమీపంలోని పల్లిపాలెం డైట్ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. అనంతరం తన సహధర్మచారిని కూడా వృత్తిరీత్యా ప్రధానోపాధ్యారాలుగా అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.ఆమె ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె విధులు నిర్వహిస్తున్న చిలకలమర్రి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరి ఆ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పబ్లిక్ పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించడంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చాడు. అదే సమయంలో శాస్త్ర ఆధారిత గ్రంథాలు రాస్తూ వచ్చిన.. డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య రచించిన గ్రంథాలు... 1.మొల్ల రామాయణం అనువాదం.

(పద్యాలు వాటికి అర్థాలు, సారాంశం) 2.మొల్ల స్థానికత ఆధారాలు 3.మర్రిపాడు మండల చరిత్ర 4.అనంతసాగరం మండల చరిత్ర. 5.ఆత్మకూరు మండల చరిత్ర 6.ఉదయగిరి రాజ్య చరిత్ర 7. స్వర శాస్త్రం. 8.బద్వేలు రాజ్య చరిత్ర. 9.సిద్ధవటం రాజ్య చరిత్ర. 10.బ్రాహ్మ జ్ఞానోపాయం. తదితర గ్రంధాలు రచించడం కొనసాగిస్తూనే ఉన్నారు.

గడిచిన కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో దారంతో దేవత మూర్తుల కళారూపాలను తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ముందుగా శ్రీరామచంద్రమూర్తి కళారూపాన్ని దారంతో తయారు చేయడం ప్రారంభించారు ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య. ఆ సమయంలో పలు అవంతరాలు ఎదురై తను రూపొందిస్తున్న ఏకధారా కళా రూపానికి వాడిన పలు పదార్థాలు తను చేయి కాలి బొబ్బలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఇలా సరదాగా ప్రారంభించిన ఏకధార శిల్పకళా రూపాలు ఒక్కొక్కటిగా తయారు చేస్తూ ఇప్పటివరకు 3 వేల కళారూపాలను తయారు చేశాడు. అందులో దేవతామూర్తులు,రాజులు, రాజకీయ నాయకుల కళారూపాలు తయారు చేశారు. ఈ కళారూపాలు వెలుగులోకి రావడంతో గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాల్టీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఇలా పలు అవార్డులు అందుకున్నారు. అంతేకాక ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు. అంతటితో ఆగని ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య. ఇటీవల రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంది అవార్డుల ప్రధానోత్సవం లో కూడా నంది అవార్డు గెలుచుకున్నాడు. ఇన్ని అవార్డులు ఇన్ని రికార్డులు వచ్చిన ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్యకు తనతోనే ఈ కళారూపాల నైపుణ్యం ఆగిపోకూడదని భావించి తన పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటుగా ఏకధార కళ రూపాల నైపుణ్యం నేర్పిస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్యను ఔరా బడిపంతులు మున్నెల్లి శివశంకరయ్య అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News