Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ సంచలనం.. పన్ను వసూళ్లలో ఆల్-టైమ్ రికార్డ్!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పన్ను వసూళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

Update: 2026-04-06 15:19 GMT

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ సంచలనం.. పన్ను వసూళ్లలో ఆల్-టైమ్ రికార్డ్!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ 2025 26 ఆర్థిక సంవత్సరానికి గాను 128 కోట్ల పన్నుల వసూళ్లను సాధించి, చరిత్ర సృష్టించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో.. కార్యాలయంలోని, కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వార్షిక విజయోత్సవ అభినందన సభను సోమవారం నిర్వహించారు. వేడుకల సభకు ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ ఇంతియాజ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగంతో పాటు ఇతర అన్ని విభాగాల సమిష్టి సహకారం, పూర్తి సమన్వయంతో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధించామని హర్షం వ్యక్తం చేశారు. వేడుకలలో భాగంగా రెవెన్యూ వసూళ్ల సాధనలో విశేషంగా కృషి చేసిన అధికారులు, ఇన్స్పెక్టర్లు, వార్డు అడ్మిన్ సెక్రటరీలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహుకరించారు. విజయోత్సవ వేడుకలలో భాగంగా హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.

ఈ సభలో కార్పొరేటర్లు రామకృష్ణ, మాల్యాద్రి, కో ఆప్షన్ సభ్యులు జమీర్, నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణ వార్డు గ్రామ సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, అన్ని విభాగాల అధికారులు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డ్ సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, బిల్ కలెక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News