Visakhapatnam: గంట్ల శ్రీనుబాబు ఉదారత.. జర్నలిస్టుకు తక్షణ సాయం!

Visakhapatnam: విశాఖపట్నంలో జర్నలిస్టుల పట్ల గంట్ల శ్రీనుబాబు ఉదారత. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విలేకరికి స్పాట్‌లోనే 20 వేల సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.

Update: 2026-04-06 12:16 GMT

Visakhapatnam: గంట్ల శ్రీనుబాబు ఉదారత.. జర్నలిస్టుకు తక్షణ సాయం!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి సహాయం చేస్తున్న గంట్ల శ్రీనుబాబు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరైనా సహాయం కోరితే రేపు, ఎల్లుండి అంటూ ఆలస్యం చేసే ఈ రోజుల్లో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే స్పందించి స్పాట్‌లోనే రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు.

జర్నలిస్టుల సమస్యలను గమనించి, వారి కష్టకాలంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్న శ్రీనుబాబు గారు ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో ముందుంటారని స్థానిక జర్నలిస్టులు పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడు మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో సహాయం చూపించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఇక నగరంలో నేడు గ్రూపు సభ్యులు నిరంతరం జర్నలిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు, వారు అందిస్తున్న సహాయ సహకారాలు విశేషంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమాలను బాధ్యతతో సమన్వయం చేస్తూ నిర్వహిస్తున్న ఎమ్మెస్సార్ ప్రత్యేకతగా గుర్తింపు పొందుతున్నారు. వారి సమర్థ నిర్వహణ వల్ల విశాఖ జర్నలిస్టులకు కొండంత బలం చేకూరుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జర్నలిస్టుల పట్ల ఈ విధంగా అందుతున్న సహకారం, సంఘీభావం మీడియా రంగంలో పనిచేసే వారికి నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుందని సహచరులు పేర్కొన్నారు.

Tags:    

Similar News