Markapuram: గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ వేడుకలు

Markapuram: మార్కాపురంలో బీజేపీ 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిటీ చైర్మన్ లంకా దినకర్ హాజరై వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై హామీ ఇచ్చారు.

Update: 2026-04-06 10:46 GMT

Markapuram: గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ వేడుకలు

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ హాజరయ్యారు.

అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో లంకా దినకర్ మాట్లాడుతూ మార్కాపురం జిల్లాను నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందకరమని, పశ్చిమప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి సాగు,తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News