Sri Sathya Sai: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్.. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో సందడి

Sri Sathya Sai: ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పుట్టపర్తి పర్యటన. జేఎన్‌టీయూ స్నాతకోత్సవం నిమిత్తం విచ్చేసిన గవర్నర్‌కు మంత్రులు టీజీ భరత్, సవిత స్వాగతం పలికారు.

Update: 2026-04-06 07:08 GMT

Sri Sathya Sai: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్.. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో సందడి

పుట్టపర్తి: అనంతపురంలో జరిగే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉదయం 10:10 గంటలకు పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. సత్యసాయి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు, అధికారులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ రోడ్డు మార్గాన అనంతపురం జేఎన్టీయూకు బయలుదేరి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని మధ్యాహ్నం 1 గంటకు రోడ్డు మార్గానా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రశాంతి నిలయంలోని శ్రీ సాయి శ్రీనివాస అతిథి గృహంలో విడిది చేయనున్న గవర్నర్ సాయంత్రం 4:10 నిమిషాలకు ప్రశాంతి నిలయం నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని,4:15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. గవర్నర్ రాక నేపద్యంలో పుట్టపర్తి విమానాశ్రయం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News