Kodumur: సూర్య ఘర్ వెలుగులు.. బాధితులకు ఎమ్మెల్యే భరోసా!
Kodumur: కోడుమూరు మండలం వర్కూరులో పీఎం సూర్య ఘర్ ఉత్సవ్‌ను ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి ప్రారంభించారు.
Kodumur: సూర్య ఘర్ వెలుగులు.. బాధితులకు ఎమ్మెల్యే భరోసా!
Kodumur: కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో ఎంపి బస్తిపాటి నాగరాజు ఎంఎల్ఏ దస్తగిరి కెడిసిసి ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించారు.వర్కూరులో ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ సి ఎస్ టి లకు అందిస్తున్న ఉచిత సౌర విద్యుత్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఎస్ సి, ఎస్ టి ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని చెప్పారు.
అనంతరం కోడుమూరు మెయిన్ బజార్ లో మట్టి మిద్దె కూలిన బాధితుడు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటన గురించి వాకబు చేశారు. ప్రభుత్వం అండగా వుంటుందని. చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి వుందని, పక్కా ఇళ్లు నిర్మిస్తానని హామిచ్చారు. తక్షణ సహాయం క్రింద బాధితుడికి కెడిసిసి ఛైర్మెన్ 10,000/- ల ఆర్ధిక సహాయమందించాడు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, గోరంట్ల మధు, చేనేత కార్మికుడు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు .