Nellore: బట్వాడిపాలెంలో వాటర్ ఫౌంటెన్ సందడి.. ప్రారంభించిన మేయర్!

Nellore: నెల్లూరు రూరల్ 36వ డివిజన్ బట్వాడిపాలెంలో రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటెన్ ప్రారంభం! ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో సాగుతున్న అభివృద్ధి పనులు.

Update: 2026-04-07 05:23 GMT

Nellore: బట్వాడిపాలెంలో వాటర్ ఫౌంటెన్ సందడి.. ప్రారంభించిన మేయర్!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్, బట్వాడిపాలెం సెంటర్ నందు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు నగర మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఎన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు నగర మేయర్ దేవరకొండ సుజాత.

ఎప్పుడూ జరగని విధంగా నగర కార్పొరేషన్ పరిధిలో గత ఏడాది కాలంలోనే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో నిరంతరం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్.

ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 36వ డివిజన్ అభివృద్ధికి 3 కోట్ల 98 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు..

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణకి, ఆనం రామనారాయణ రెడ్డికి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, శాసనమండలి సభ్యులు మరియు నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర కి, నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పిండి శాంతి శ్రీ, 36 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రసూల్, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఊరందూరు సురేంద్రబాబు, కో క్లస్టర్ ఇంచార్జ్ లక్ష్మిరెడ్డి, టిడిపి నాయకులు పూడి ఆనందబాబు, చెంగలపట్టు శేఖర్, షేక్ అబూబకర్, చల్లా భాస్కర్, షేక్ మునీర్, కుమార్ హరి కుమార్, మల్లెల నీతి రాజు, నందిపాటి పూలం రాజు, లోక్నాథ్ సింగ్, క్రిష్ణగిరి శివా సింగ్, మారుతి, షేక్ అబ్దుల్ జాబీర్, షేక్ అఖిల్, షేక్ సాజిద్, షేక్ ముజమిన్, షేక్ జిలాని, బత్తల లక్ష్మి, ద్వారం సుగుణ రెడ్డి, షేక్ బాబు, బాసి శెట్టి సృజన్, కయ్యూరు మనోహర్, నక్క బోయిన గోపి, సర్వేపల్లి బాలకృష్ణ, పి. రాజు, నరేష్, శ్రోణిత్, హర్షిత్, సందీపుడి ఆనంద్, జనసేన నాయకులు జమీర్, సురేష్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News