Nellore: మృత్యువు అంచున ఉన్న 50 మంది ప్రయాణికులు సేఫ్!

Nellore: నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని బీరాపేరు వంతెనపై రోడ్డు ప్రమాదం. అతివేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

Update: 2026-04-06 06:51 GMT

Nellore: మృత్యువు అంచున ఉన్న 50 మంది ప్రయాణికులు సేఫ్!

నెల్లూరు జిల్లా: సంగం సమీపంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారి బీరాపేరు వంతెనపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన సిమెంట్ ట్యాంకర్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ను సైడ్‌లో ఢీకొట్టిన ట్యాంకర్ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా ఆగడంతో, వెనుక నుంచి వస్తున్న బైక్ బస్సు కిందకు వెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, సమీప ఆసుపత్రికి తరలించారు.అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పేను ప్రమాదం తృటిలో తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సక్రమంగా నియంత్రిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Tags:    

Similar News