Nellore: నెల్లూరు రూరల్‌లో 3 వేల మందికి సౌర విద్యుత్ లబ్ధి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Nellore: నెల్లూరు రూరల్‌లో 3 వేల మందికి సౌర విద్యుత్ లబ్ధి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామం చెర్లో ఎస్.టి. సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కి శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా 3 వేల మందికి 36 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు..పెనుబర్తి, కలివెలపాలెం, మాదరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాల ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దానికి స్థానిక శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
3 ఫేజ్ కరెంటు పనులు 100 శాతం పనులు పూర్తిచేసి నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు.. రాష్ట్రం కోసం నిరంతరం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, నెల్లూరు ట్యాంక్ సప్లై డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మెన్ ఏలూరు శివయ్య నాయుడు, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి భాస్కర్ రెడ్డి, చిరమన శ్రీనివాసులు రెడ్డి, జానాబత్తిన రవి, సుమంత్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, ఏలూరు శీనయ్య నాయుడు, అలగల మల్లికార్జున, చిట్టేటి రవీంద్ర రెడ్డి, తుమ్మతాటి రవి, తాండ్ర పెంచలయ్య, తాండ్ర నాగేంద్ర, జి. మనోహర్, షేక్ సుభాన్ జాన్, జి. అంకయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.