KTR: ఆ పార్టీ నేతలకే గ్యారంటీ లేదు.. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం..
KTR: ఆరిపోయే దీపం లాంటి కాంగ్రెస్, గ్యారంటీ హమీలిస్తోందని...ఆ పార్టీకి ఆ నేతలకే గ్యారంటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
KTR: ఆ పార్టీ నేతలకే గ్యారంటీ లేదు.. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం..
KTR: ఆరిపోయే దీపం లాంటి కాంగ్రెస్, గ్యారంటీ హమీలిస్తోందని...ఆ పార్టీకి ఆ నేతలకే గ్యారంటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రగతిరథ చక్రాలు ఆగకూడదంటే ప్రజలు మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ఆరిపోయే దీపం లాంటి, చచ్చిన శవం లాంటి పార్టని, ఆ పార్టీ వచ్చి ఇప్పుడు డైలాగులు కొడితే మళ్ళీ ఆగమవుదామా, అభివృద్ధిలో భాగమవుదామా అని ఆలోచించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.