Hyderabad: మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు.. ఆమెతో కలిసి ఉండేందుకే..
Meerpet Murder Case Update : హైదరాబాద్ మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Hyderabad: మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు.. ఆమెతో కలిసి ఉండేందుకే..
Meerpet Murder Case Update : హైదరాబాద్ మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసుండేందుకే పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు తెలుస్తోంది. భార్య మాధవిని భర్తే చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలించారు. అందులో ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను గుర్తించారు. పోలీస్ విచారణలో తానే హత్య చేసినట్టు అంగీకరించాడు గురుమూర్తి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను అతి దారుణంగా హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇవాళ గురుమూర్తిని కోర్టులో హాజరుపర్చనున్నారు మీర్‌పేట్ పోలీసులు. ఇప్పటికే రెండుసార్లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నాక మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన క్లూస్ టీమ్.. కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Also Read: Hyderabad: భార్యను చంపే ముందు భర్త ప్రాక్టీస్..ఎముకలు, మాంసం వేరు చేసి..