Hyderabad: భార్యను చంపే ముందు భర్త ప్రాక్టీస్..ఎముకలు, మాంసం వేరు చేసి..

Another Sensation Meerpet Madhavi Case Latest Updates Developments Telugu News
x

Hyderabad: మీర్ పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు..ఒకరు కాదు ముగ్గురా? 

Highlights

భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమి సంబంధం లేనట్లు నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు.

అనుమానం.. పెను భూతం.. ఆ అనుమానం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా దారి తీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకున్న అనుమానంతో.. కట్టుకున్న ఇల్లాలుని కడతేర్చేశాడు ఓ కిరాతక భర్త. క్షణికావేశంలో చంపేసి.. తప్పించుకునేందుకు మరింత పాశవికంగా ప్రవర్తించాడు. చివరకు తన డ్రామాలు బయటపడి తానే హత్య చేసుకున్నట్టు వెల్లడించాడు. హైదరాబాద్‌‌ మీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమి సంబంధం లేనట్లు నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతకుముందే అందుకు సంబంధించి స్కెచ్‌ వేశాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ దాకా పక్కా ప్లాన్‌ చేసి.. ఇంప్లిమెంట్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్‌లో ఉడికించి.. ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసి సమీపంలోని చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డీఆర్‌డీవోలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నెల 15న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం.

భార్యను చంపే ముందు గురుమూర్తి ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేశాడు. కుక్కను చంపేసి అదే మాదిరిగా భార్యను కడతేర్చాడు. ఆమె డెడ్‌బాడీని మాయం చేసి తప్పించుకోవాలని భావించాడు. మటన్ కొట్టే కత్తిని తీసుకొచ్చి భార్య బాడీని ముక్కలు చేశాడు. ఎముకలు మాంసాన్ని వేరుచేసి.. మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ తర్వాత భార్య ఎముకలను వేరుచేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ప్లాన్ ప్రకారం పని ముగించాడు.

ఇక ఇదంతా జరిగాక.. తప్పించుకోవడం కోసం ఈ నెల 18న తన భార్య తల్లికి ఫోన్‌ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఈనెల 18న మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తనపై అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు ఠాణాకు అత్తతోపాటు గురుమూర్తి కూడా వెళ్లాడు. వెంకట మాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చినట్లు ఆధారాలు లభించలేదు. గురుమూర్తి మాత్రం పదే పదే ఇంట్లోకి, బయటకు వెళ్లివచ్చినట్టు దృశ్యాలు రికార్డయ్యాయి.

ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకంగా మారగా.. ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందు పొంతనలేని సమాధానాలిచ్చిన నిందితుడు... గట్టిగా ప్రశ్నించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. ఎముకల పొడిని, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories