సరూర్ నగర్ అప్సర హత్య కేసు: సాయికృష్ణకు జీవిత ఖైదు

సరూర్ నగర్ అప్సర హత్య కేసు: సాయికృష్ణకు జీవిత ఖైదు
x
Highlights

సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో దోషి సాయిృష్ణకు జీవితఖైదు విధించింది కోర్టు.

సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో దోషి సాయిృష్ణకు జీవితఖైదు విధించింది కోర్టు.సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షవిధించింది కోర్టు. జీవితఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించింది న్యాయస్థానం. మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం మంజూరు చేసింది కోర్టు. షాద్ నగర్ కు కారులో తీసుకెళ్లి ఆమెను హత్యచేశారు సాయికృష్ణ. ఆతర్వాత డెడ్ బాడీని తాను పనిచేసే ఆలయానికి సమీపంలోని సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చి పెట్టారు. 2023 జూన్ 6న అప్సర హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగింది?

సరూర్ నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో వెంకటసాయికృష్ణ పూజారిగా పనిచేసేవారు. ఇదే ప్రాంతంలో తల్లితో కలిసి ఉండే అప్పరతో వెంకటసాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది కొన్ని రోజుల పాటు సాగింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఆయనపై ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే ఆయనకు పెళ్లైంది. అప్సరను పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేశారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

ఎవరీ అప్సర ?

అప్సర తండ్రి ఉత్తర కాశీలో ఉంటారు. తల్లితో కలిసి అప్సర కొంతకాలం తమిళనాడులో ఉన్నారు. తమిళంలోని కొన్ని సినిమాల్లో ఆమె నటించారు. మోడలింగ్ పై ఆమెకు ఆసక్తి. సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో 2022 ఏప్రిల్‌లో తల్లితో కలిసి ఆమె హైదరాబాద్ వచ్చారు. సరూర్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయానికి సమీపంలోనే నివాసం ఉండేవారు. తరచూ ఆమె ఈ ఆలయానికి వెళ్లేవారు. ఇలా సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని తేలిందని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.

కోయంబత్తూరు వెళ్తున్నానని...

కోయంబత్తూరుకు వెళ్తున్నట్టు తల్లికి చెప్పి 2023 జూన్‌ 3వ తేదీన అప్సర బయలుదేరింది. సాయికృష్ణ ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపేందుకు తన కారులో తీసుకెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కారులోనే అప్సరను సాయికృష్ణ ఊపిరి ఆడకుండా చేసి చంపారు. మృతదేహాన్ని కారులోనే తన ఇంటికి తీసుకువచ్చారు. డెడ్ బాడీ మాయం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తాను పనిచేసే గుడికి సమీపంలోని డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచి దుర్వాసన వస్తుందని చెప్పి జేసీబీతో తవ్వించారు. తెల్లవారుజామునే ఈ డెడ్ బాడీని అక్కడే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత సిమెంట్ తో దాన్ని మూసివేయించారని పోలీసులు గుర్తించారు.

అప్సర తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు

కోయంబత్తూరుకు వెళ్తున్నానని వెళ్లిన అప్సర నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లి ఆందోళన చెందారు. ఈ విషయమై సాయికృష్ణను నిలదీశారు. అయితే తనకు ఏమి తెలియదని ఆమె వద్ద సాయికృష్ణ అప్పట్లో చెప్పారని పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారించిన పోలీసులు వెంకటసాయికృష్ణతో కలిసి అప్సర వెళ్లిన విషయాన్ని గుర్తించారు. వెంకటకృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories