తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం..
Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం..
Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హిమాయత్‌నగర్, నారాయణగూడ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, సైదాబాద్, మలక్‌పేట్, కార్వాన్, షేక్‌పేట్, రాయదుర్గం, కాప్రా, చర్లపల్లి, ఈసీఐఎల్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, సురారం, సుచిత్ర, బాలానగర్, మల్కాజిగిరి, అమీన్‌పూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరవాసులకు జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.