Nandini Sidhareddy: అక్షర యోధుడికి అరుదైన గౌరవం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు!

Nandini Sidhareddy: తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రముఖ కవి మరియు రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.

Update: 2026-03-16 10:21 GMT

Nandini Sidhareddy: అక్షర యోధుడికి అరుదైన గౌరవం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు!

Nandini Sidhareddy: తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రముఖ కవి మరియు రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ వార్త తెలియగానే సాహిత్య లోకంతో పాటు తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కష్టాలే ఇతివృత్తంగా ‘అనిమేష’

కరోనా కాలంలో సమాజం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, మానవ సంబంధాలు మరియు సామాజిక మార్పులను ఇతివృత్తంగా తీసుకుని నందిని సిధారెడ్డి ‘అనిమేష’ కవితా సంపుటిని రచించారు. ఆనాటి వేదనను, సామాజిక స్థితిగతులను తన అక్షరాలతో కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు అకాడమీని ఆకట్టుకుంది.

తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు

‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....’ వంటి పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచిన నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా సేవలందించారు. ఉద్యమ సమయంలో తన కవిత్వంతో అస్తిత్వాన్ని చాటిన ఆయనకు, ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం తెలంగాణ సాహిత్య రంగానికి గర్వకారణమని మేధావులు కొనియాడుతున్నారు. ఆయనకు ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించగా, ఇప్పుడు కేంద్ర సాహిత్య పురస్కారం దక్కడం విశేషం.

Tags:    

Similar News