దేవుడి గుళ్ళో సంతకాలు ఏమయ్యాయి?: రేవంత్ సర్కారుపై కౌశిక్ రెడ్డి ఫైర్!

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

Update: 2026-03-16 10:02 GMT

దేవుడి గుళ్ళో సంతకాలు ఏమయ్యాయి?: రేవంత్ సర్కారుపై కౌశిక్ రెడ్డి ఫైర్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ ఆయన సర్కారును నిలదీశారు. గతంలో దేవుడి గుళ్ళో సంతకాలు పెట్టి మరీ హామీలు ఇచ్చారని, కానీ నేడు అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

రైతు భరోసా, రుణమాఫీపై ప్రశ్నల వర్షం

"రైతులకు రూ. 15 వేల భరోసా ఇస్తామన్నారు.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. మూడు వాయిదాలు విడుదల చేయకుండా రైతులను వంచించారు. అసలు రైతు భరోసా, రుణమాఫీ పూర్తయిందో లేదో నాకు తెలియదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది" అని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు!

మహిళలకు ఇస్తామన్న రూ. 2500 నెలవారీ భృతి మరియు తులం బంగారం హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పింఛన్ల పెంపుతో పాటు ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తామన్న మాటను ప్రభుత్వం మర్చిపోయిందని ధ్వజమెత్తారు. "అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులను రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది?" అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News