Kamareddy: చుక్క నీరు లేక.. రోడ్డుపై వజ్జపల్లి మహిళల ధర్నా!
Kamareddy: ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తమ గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం వజ్జపల్లి గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Kamareddy: చుక్క నీరు లేక.. రోడ్డుపై వజ్జపల్లి మహిళల ధర్నా!
సదాశివ నగర్ (కామారెడ్డి): ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తమ గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం వజ్జపల్లి గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మిషన్ భగీరథ నీళ్లు రావు.. బోర్లు పని చేయవు!
గత కొన్ని రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'మిషన్ భగీరథ' ద్వారా ఇంటింటికి నీరు అందడం లేదని, అటు గ్రామంలోని స్థానిక బోర్లు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఉదయాన్నే పనులన్నీ మానుకుని నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు.