Hyderabad: ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: నగరంలోని ఫలక్‌నుమా పరిధిలో గల ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కనే ఉన్న ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2026-03-16 12:10 GMT

Hyderabad: ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని ఫలక్‌నుమా పరిధిలో గల ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కనే ఉన్న ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దుకాణాలకు విస్తరించిన సెగలు

ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ఫర్నిచర్ షాపు ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

తప్పిన పెను ముప్పు?

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఇండేన్ గ్యాస్ గోదాం ఉండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్ర అప్రమత్తమయ్యారు. మంటలు గోదాం వైపు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒకవేళ మంటలు గ్యాస్ సిలిండర్ల వరకు చేరి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ, ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News