GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. పాల ప్యాకెట్‌ కోసం బయటకు వచ్చిన చిన్నారి.. నాలాలో పడి మృతి..

Hyderabad Rains: సికింద్రాబాద్‎లోని కళాసిగూడలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2023-04-29 05:32 GMT

GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. పాల ప్యాకెట్‌ కోసం బయటకు వచ్చిన చిన్నారి.. నాలాలో పడి మృతి..

Hyderabad Rains: సికింద్రాబాద్‎లోని కళాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. జీహెచ్‎ఎంసీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మ్యాన్‎హోల్‎లో పడి ముక్కుపచ్చలారని చిన్నారి మరణించింది. నోరు చెరుచుకున్న నాలాలో పడి నాలుగో తరగతి చదువుతున్న మౌనిక కొట్టుకుపోయింది. పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లింది మౌనిక. కానీ ఎంత సేపైనా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులను పాపను వెతికే క్రమంలో డీఆర్ఎఫ్ సిబ్బంది నాలాలో కొట్టుకు వచ్చిన పాప మృతదేహాన్ని పార్క్‎లైన్ దగ్గర కనిపెట్టారు. ఒక్కసారిగా తమ చిన్నారిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు షాక్‎కు గురయ్యారు. తమ పాప ఇక లేదన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పాప మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గాంధీ మాస్పిటల్‎కు తరలించారు.

Tags:    

Similar News