Mulugu: జంపన్న వాగులో గల్లంతైన మొత్తం 8మంది మృతదేహాలు లభ్యం

Mulugu: ములుగు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది.

Update: 2023-07-28 12:30 GMT

Mulugu: జంపన్న వాగులో గల్లంతైన మొత్తం 8మంది మృతదేహాలు లభ్యం

Mulugu: ములుగు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. వరదల్లో గల్లంతయిన వారి కుటుంబసభ్యులకు గుండెకోతను మిగిల్చింది. నిన్న కొండాయి, మల్యాల వరదలో చిక్కుకున్న 8 మంది మృత్యువాత పడ్డారు. జంపన్నవాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండాయిలో మరో 3 మృతదేహాలను NDRF బృందాలు వెలికితీశాయి. కొండాయి, మల్యాల వరదలో చిక్కుకొని మొత్తం 8 మంది మృతి చెందారు. మృతులు మహబూబ్‌, సమ్మక్క, మజీద్‌, అజ్జు, షరీఫ్‌, రషీద్‌, కరీమ, లాల్‌బీగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. కొండాయి, మల్యాల వరదలో చిక్కుకుని 8 మంది మృత్యువాత పడటంపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే.. తక్షణ సాయం కింద 25వేల రూపాయల ఆర్థికసాయం అందించనుంది.

Tags:    

Similar News