Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-23 02:34 GMT
Live Updates - Page 4
2020-09-23 06:38 GMT

Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..

విజయవాడ..

నక్కా ఆనందబాబు మాజీ మంత్రి...

-16 నెలల నుంచీ నిరాధార ఆరోపణలు తప్ప, వైసీపీప్రభుత్వం టీడీపీపై వేసిన నిందలను నిరూపించలేకపోయింది.

-ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటి పదాలు ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిందే జగన్, విజయసాయి రెడ్డి.

-కేంద్రం అడక్కుండానే అన్ని బిల్లులకు వైసీపీఎంపీలు గుడ్డిగా మద్థతు ఇస్తున్నారు.

-ఆఖరికి కేంద్రం ఇచ్చే అప్పుకోసం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి కూడా సిద్ధమయ్యారు.

-ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలైనప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడు.

-ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.700కోట్లయితే, రూ.2వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?

-అవినీతిపరుల కేసుల విచారణను సుప్రీం వేగవంతం చేస్తుండటంతో, జగన్ ఆయన బృందానికి వణుకు మొదలైంది.

2020-09-23 06:35 GMT

Andhra Pradesh updates: ఇందిరా భవన్ లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం..

ఆంధ్ర ప్రదేశ్..

-కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇంచార్జ్ ఉమెన్ చాందీ,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు,   తులసి రెడ్డి ,పల్లం రాజు ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు.

-ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ..

2020-09-23 06:31 GMT

Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..

తూర్పుగోదావరి-రాజమండ్రి..

గోరంట్ల బుచ్చియ్యచౌదరి కామెంట్స్..

-అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు

-రోడ్లు ధ్వంసమైతే కనీస మరమ్మతులు లేవు

-ప్రభుత్వ దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి..

-ఇళ్ళ పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, టిట్ కో హౌస్ లుగా కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలి లేని పక్షం లో ఉద్యమిస్తాం...

-న్యాయ వ్యవస్థపై కూడా ఈ ప్రభుత్వం లో ఉన్న వారు దాడి చేస్తున్నారు

-బూతుల మంత్రులు, బూతుల స్పీకర్లు ఉండటం ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ....

-అమరవతిపై, హిందు దేవతలపై బూతులు మాట్లాడ్తున్న కొడాలి నాని లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు...

-హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులలో కనీసం ఒక్కరినైన అరెస్ట్ చేశారా

-అసెంబ్లీ లో ఐదుగురం వున్నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం

-ఏ మతసంస్థల మీద దాడులు జరిగినా తప్పే... ఆలయాలు మీద, మాత సంస్థలు మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

2020-09-23 06:25 GMT

Visakha updates: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు దుర్మార్గం: వెలగపూడి రామకృష్ణబాబు..

విశాఖ..

-టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కామెంట్స్..

-రాష్ట్రంలో హిందూ దేవాలయాలు పై వరుస దాడులను నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి అద్వర్యంలో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద   నిరసన.

-హిందు దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా కొబ్బరికాయలు కొట్టి ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపిన టీడీపీ నాయకులు.

-వందరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.

-జగన్ మోహన్ రెడ్డికి,మంత్రి కొడాల నానికి బుధ్ధి మారాలని ఆంజనేయస్వామిని ప్రార్థించాము.

-రాష్ట్రంలో మూడు మతాల వారు భయబ్రాంతులకు గూరౌతున్నారు.

-జగన్ మోహన్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రి కొడాలి అలా మాట్లాడుతారా?

-కొడాలి నానా తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

-తిరుపతి వెలుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి హిందువుల మనోభావాలు కాపాడాలి.

2020-09-23 06:21 GMT

Vijayawada updates: జర్నలిస్టులకు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ: దేవిరెడ్డి శ్రీనాధ్..

విజయవాడ..

-ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్..

-గ్రామీణ జర్నలిస్టులకు, డెస్కులలో పనిచేసే వారికి శిక్షణ

-సమగ్ర సమాచారంతో అకాడమీ వెబ్ సైట్ ఉంటుంది

-జర్నలిస్టులకు కోవిడ్ రిలీఫ్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

-26వ తేదీ నుంచీ విశాఖ నుంచీ శిక్షణ ప్రారంభం అవుతుంది

-ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సంపూర్ణ జర్నలిస్టులుగా తీర్చి దిద్దుతాం

-ఏ ఏ జిల్లాలలో శిక్షణ ఎప్పుడు అనే వివరాలు త్వరలో ఇస్తాం

-జృనలిస్టుల‌ సంక్షేమం ప్రెస్ అకాడమీ విస్మరించదు

-అన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం

-నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీతో మొదటి ఒప్పందం..

2020-09-23 06:17 GMT

Amaravati updates: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం..

జాతీయం..

-సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి

-పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని వినతి

-పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని వినతి

-2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్

-రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలన్న సీఎం

-పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రి కోరిన ముఖ్యమంత్రి

-త్వరలోనే పోలవరం పర్యటన కు వస్తానన్న జలశక్తీ మంత్రి

-గోదావరి - కావేరి నదుల అనుసంధానంపైనా చర్చ

-నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటన కు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించిన కేంద్ర మంత్రి

2020-09-23 06:14 GMT

Tirumala updates: జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే శ్రీవారిని దర్శించుకోవాలి... బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి

తిరుపతి...

-బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి..

-హౌస్ అరెస్టులో ఉన్న నేతలు ఇళ్ళలోనే నిరసన..

-కొడాలి నానిని బర్తరఫ్ చేసిన తరువాతే తిరుపతికి రావాలి..

2020-09-23 06:03 GMT

National updates: అధికారుల నిర్లక్ష్యం....అర్థరాత్రి ఢిల్లీలో మకాం మార్చిన సీఎం జగన్..

జాతీయం..

-అధికార నివాసం 1 జన్‌పథ్ నుంచి ఏపీ భవన్ సీఎం కాటేజికి మకాం మార్పు

-1 జన్‌పథ్‌లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా అసౌకర్యం

-అందుకే సీఎం కాటేజికి మార్చిన అధికారులు..

2020-09-23 05:57 GMT

Amaravati updates: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముగిసిన జగన్ సమావేశం..

అమరావతి..

-40 నిమిషాల పాటు సాగిన భేటీ..

-రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై హోంమంత్రితో చర్చించిన ఏపీ సీఎం..

2020-09-23 05:54 GMT

Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ..

తిరుమల..

రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారు

ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు

ఈ వివాదాలన్నీ తాత్కాలికమే

స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్ర కు ముందు,తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Tags:    

Similar News