Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-23 02:34 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-23 12:04 GMT

తిరుమల-తిరుపతి..

-ముఖ్యమంత్రిని కలిసిన రమణదీక్షితులు వంశపారంపర్య అర్చక కుటుంబ పెద్దలు

-సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి

-దర్శనానంతరం చర్చిద్దామని సూచించిన సియం

-మళ్ళీ కలవనున్న రమణదీక్షితులు

2020-09-23 12:00 GMT

విశాఖ....

-పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ తిక్కవానిపాలెం సముద్రతీరాన గల ఉప్పుటేరులో శివలింగం,భైవవస్వామి,విష్టుమూర్తి,కుమారస్వామి   విగ్రహాలు బయటపడ్డాయి.

-గ్రామ పెద్ద సూరాడ సత్తయ్యకు గత ఆరు నెలలుగా ఉప్పుటేరులో విగ్రహాలు ఉన్నట్టు కలలు వస్తున్నాయని గ్రామస్తులకు చెప్పినా ఇది మూడ నమ్మకని     కొట్టిపారేసారు.

-సూరాడ సత్తయ్య కలలో విగ్రహరూపాలు కదలాడటంతో బుదవారం గ్రామస్తుల సహాయంతో ఉప్పుటేరులో గాలించగా విగ్రహాలు బయటపడ్డాయి.

-ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి విగ్రహాలను తిలకించారు.

2020-09-23 11:47 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..

-రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

-ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

-రోడ్డు మార్గాన తిరుమలకు పయనం

2020-09-23 11:33 GMT

తిరుమల.. 

- జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా రావాలంటున్న బిజెపి నేతలు మోదీ రామాలయ శంఖు స్థాపనకు ఏ భార్యతో వచ్చారంటూ వ్యాఖ్య

- యోగి ఆదిత్యనాథ్ ఏ భార్యతో వచ్చారో చెప్పాలని చురక

- శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భార్యతో వచ్చారని వ్యంగ్య వ్యాఖ్యలు

- దేవస్థానం వారు పిలిస్తే వచ్చిన ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడటం భావ్యం కాదు..

- ఈ నిబంధన కరెక్ట్ కాదు.

- అందుకే ఎవరు పెట్టారో అని అడిగాను...

2020-09-23 11:26 GMT

 తూర్పుగోదావరి -మండపేట..

- మాజీ ఎమ్మెల్యే , వైసీపీ మండపేట కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు

- ఘటన స్థలంలో సుత్తిని స్వాధీనం చేసుకొని ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్

- విగ్రహాలు ధ్వంసమైన చర్చ్ ను సందర్శించిన మండపేట వై.సి.పి కోఆర్డినేటర్, పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు తోట త్రిమూర్తులు

- మండపేటలో క్రైస్తవ విగ్రహాల ధ్వంసం ఆకతాయిల పని కాదు అసాంఘిక శక్తులు చేసినదే

- మతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టి మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతోంది

- ఘటనపై సి.ఎం జగన్ , డి.జి.పి.లు తక్షణమే స్పందించారు,

- దోషులు ఎవరైనా కఠిన శిక్ష తప్పదు

2020-09-23 11:16 GMT

అమరావతి..

-విజయవాడలో ని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సుందరికరణ పనులకు 2 కోట్ల 75 లక్షల రూపాయల ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసిన     పురపాలక శాఖ

-ఫ్లై ఓవర్ దిగువన 1 నెంబర్ పిల్లర్ నుంచి 47 పిల్లర్ వరకు సుందరీ కరణ పనులు చేపట్టాలని నిర్ణయం

-ఎస్వీఎస్ కల్యాణ మండపం నుంచి గురునానక్ కాలనీ రోడ్ వరకు ల్యాండ్ స్కెప్ పనులు

-విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సాదారణ నిధుల నుంచి ఈ మొత్తం ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ

2020-09-23 10:56 GMT

అమరావతి..

- ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు

- జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత

- జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు

- దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలిదశ కార్యక్రమాలు

- కోవిడ్-19 సమయంలో గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చిన పక్షోత్సవాలు

- ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం

- 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట

- ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ

- ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు

- ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ

2020-09-23 10:53 GMT

తిరుపతి..

- ముఖ్యమంత్రి పర్యటనలో ఎయిర్ పోర్టులో ఆంక్షలు

- మీడియాను సైతం దూరంగా పంపేసిన భద్రతా సిబ్బంది

- పోర్డికో నుంచి దూంరగా మీడియా

2020-09-23 10:43 GMT

టీటీడీ మాజీ బోర్డు సభ్యులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు...

- తమిళనాడు నుండీ గొడుగులు పాదయాత్ర గా 10 రోజులు నడుస్తూ తిరుమలకు చేరి స్వామివారికి సమర్పిస్తారు...

- అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించే ఆచారం ఉంది...

- తిరుమలలో అన్యమతస్థులు ,విదేశీయులు దర్శనార్థం వచ్చినప్పుడు దేవుని పై భక్తి ,విశ్వాసం ఉన్నట్లుగా డిక్లరేషన్ ఇచ్చే నియమము హిందూ సంప్రదాయం    లో ఉంది...

- సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తరువాత నే పట్టువస్త్రాలు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వాహక అధికారిని కోరుతున్న...

- తద్వారా రాష్ట్రానికి ,దేశానికి అరిష్టం అవుతుంది...

2020-09-23 10:31 GMT

hmtv తో స్వామి పరిపూర్ణానంద ...

- నాని ఆంజనేయ స్వామిని బొమ్మ అని అంటాడు , రధాన్ని ఇంకేదో అంటాడు అతనికి విజ్ఞత లేదు ...

- 1810 లో నుండే తిరుపతి దేవాలయాల పై డిక్లరేషన్ ఉంది...

- ఏపీ లో వరుసగా దేవాలయాల పై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నుండి సరైన విధంగా స్పందన లేదు..

- ఇప్పటికైనా డిక్లరేషన్ గురించి ముఖ్యమంత్రి చెప్పకపోతే తదుపరి కార్యాచరణ శాంతియుతంగా న్యాయబద్దంగా చేస్తాము...

- దేవాలయాలు కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పర్యటిస్తా..

Tags:    

Similar News