Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-23 02:34 GMT
Live Updates - Page 2
2020-09-23 10:07 GMT

West Godavari updates: ఇసుక అక్రమ రవాణా కేసులో సీఐ నాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్..

పశ్చిమ గోదావరి..

▪️ఇసుక అక్రమ రవాణా కేసు విషయంలో అవినీతికి పాల్పడిన సీఐ నాయక్,ఎస్సై గంగాధర్ పై వేటు పడింది.

▪️ఇటీవల జంగారెడ్డిగూడెంలో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను అడ్డుకున్నందుకు, స్టేషన్ లో కంప్యూటర్ డేటాను తొలగించిన విషయంలో ఉన్నతాధికారులు దృష్టి

▪️ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెం సీఐ బి. నాగేశ్వర్ నాయక్, ఎస్.ఐ ఎస్.ఎస్.ఆర్ గంగాధర్ ను ఏలూరు రేంజ్ డి. ఐ.జి శ్రీ కె.వి.మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు.

2020-09-23 09:58 GMT

Seshachalam forest: శేషాచలం అడవులలో వన్యప్రాణుల ను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్..

శేషాచలం అడవులు..

-నాటు తుపాకీ స్వాధీనం

-ఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువుల వేటగాళ్ళు

-వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకుని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింపు

2020-09-23 09:47 GMT

Oommen Chandy Comments: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందనుకుంటా..ఉమెన్ చాంది..

ఉమెన్ చాంది..ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్..

-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

-కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఏపీ లో నిరసన కార్యక్రమాలు చేపడతాం..

-పార్లమెంట్ లో చర్చ లేకుండా... రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండా.. రైతులకు నష్టం చేసే బిల్లు ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది...

-ఏపీ కి ప్రత్యేక హోదా ను యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది..టెక్నకల్ గా అన్ని ప్రోసిడర్స్ పూర్తి చేసింది..

-ఉత్తరాఖండ్ కు ఎలా అయితే ప్రత్యేక హోదా ఉందో అలాగే మాకు ఇవ్వమని కోరుతున్నాం..

-ప్రభుత్వాలు మారినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మారవు...

-ఏంధుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి..

-న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది.. ఆ వ్యవస్థ ను ఎవరు శాసించలేరు..

2020-09-23 09:39 GMT

Sailajanath Comments: బీజేపీ ,జనసేన ,వైసీపీ అన్ని కూడా ఓకేరకమైన పార్టీ లు..శైలజానాథ్..

ఇందిరా భవన్..

-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

శైలజానాథ్ ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు..

- ఏపీ లో అనేక సమస్యల విషయం లో పార్టీ ఏలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై చర్చించాము..

- దేవాలయాల జరుగుతున్న దాడుల విషయం ప్రధానంగా చర్చించాం..

- ప్రశ్నించేవారి పై ఏపీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

- అన్ని విషయాలలో భాదితుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం..

- ఈ నెల 24 నుంచి నవంబర్ 6 వరకు రైతు ల పక్షాన పోరాడుతాం..

- మూడు రాజధానులకు మేము వ్యతిరేకం..

- అప్పుడు చంద్రబాబు ,ఇప్పుడు జగన్ రాజధాని విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా పోవడం వల్లే ఈ సమస్యలు..

2020-09-23 09:32 GMT

Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..

విజయవాడ..

- జూన్ 27వరకు వెండి రథానికి ఉన్న వెండి సింహాలు

- వెండి సింహల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన 4 పోలీస్ బృందాలు

- బీహార్ కి చెందిన కార్మికులపై అనుమానాలు

- 25మంది పనిచేసిన బీహార్ కు చెందిన కార్మికులు. వారిలో 8మందిని గుర్తించి విచారించిన పోలీసులు

- వెండి వ్యాపారులపై దృష్టి పెట్టిన పోలీస్ లు

2020-09-23 09:28 GMT

Nellore updates: దమ్ము ధైర్యం, ఏమాత్రం నీతి , నిజాయితీలు, నైతిక విలువ ఉంటే ఈ ఎస్ ఐ పై ఏసీబీ దర్యాప్తు ఆదేశించాలి --టిడిపి నేత కోటంరెడ్డి సవాల్..

నెల్లూరు..

-రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈఎస్ఐ కుంభకోణం లో దోషులను తేల్చాలని నెల్లూరు ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి దేవానంద్ శాంత్రో కి వినతిపత్రం     ఇచ్చి టిడిపి నేతలు

-ఈఎస్ఐ కుంభకోణం లో మంత్రి జయరాం పీకల్లోతు ఇరుక్కున్నారు

-ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడింది

-ఈఎస్ఐ కుంభకోణం లో ఏ 14 గా కార్తీక్ నుంచి బెంజ్ కార్ తీసుకున్న ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు   చేస్తోంది

-వైసీపీ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోంది

-టిడిపి నేత అచ్చం నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం లో అనవసరంగా ఇరికించి కేసులు నమోదు చేశా రు.

2020-09-23 09:09 GMT

Guntur updates: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..యరపతినేని శ్రీనివాసరావు..

గుంటూరు ః

టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు..

-4 వేలకోట్ల కు ఆశపడి విద్యుత్ మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.

-రైతుల విషయం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

-సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.

-సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు.

-సొంత మద్యం బ్రాండ్ లతో వేల కోట్లు దోచుకుంటున్నారు.

-భవన నిర్మాణ కార్మికులు 400 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గం.

-ఏడాది కాలంలో లక్ష కోట్లు తెచ్చిన అప్పు ను ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.

2020-09-23 09:04 GMT

Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..

చిత్తూరు..

- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబొయినా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

- శ్రీవారి ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారు

- మహిళలను ఆర్థికకంగా మరీంత బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయి....

2020-09-23 08:43 GMT

Vizianagaram updates: 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన గరుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు..

విజయనగరం..

-నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడు నుంచి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

-1.80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సబ్ డివిజన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు.

2020-09-23 08:36 GMT

Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..

అనంతపురం:

కాలవ శ్రీనివాసులు ప్రెస్మీట్.

-రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

-మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ మతం, దేవలయాలపై దాడులు కొనసాగుతున్నాయి.

-ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది.

-ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయడం లేదు

-కొడాలి నాని ఉన్మాదం తో అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామంటారు.

-టీటీడీ చైర్మన్ జగన్ బంధువు డిక్లరేషన్ అవసరం లేదు అంటాడు. నాని జగన్ మనసులో మాట చెప్పారు.

-టీటీడీ ఈఓ కు డిక్లరేషన్ పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నాం. చేయాల్సిన ధర్మం సీఎం పై ఉంది.

Tags:    

Similar News