Amaravati updates: అంతర్వేది ఘటన,అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణం పై సీబీఐ దర్యాప్తు జరపాలని అమిత్ షా ను కోరిన జగన్...
అమరావతి..
-భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులపై కోర్టులు స్టే ఇవ్వడం ,దర్యాప్తు ను అడ్డుకోవడం అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన జగన్
East Godavari updates: భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.
తూర్పు గోదావరి జిల్లా :
-కోరుకొండ మండలం కోటికేశవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.
-నాడు నేడు పథకంలో భాగంగా కోటి 53 లక్షల నిధులు మంజూరు.
Srikakulam updates: లిబియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అదృశ్యం..
శ్రీకాకుళం జిల్లా..
-యువకులు సంతబొమ్మాళి మండలం సీతానగరం వాసులు..
-ఉపాధి కోసం లిబియా వెళ్ళిన యువకులు జోగారావు, వెంకటరావు, దానయ్య..
-వీసా గడువు ముగుస్తుండడంతో స్వదేశానికి తిరుగుప్రయాణం..
-విమానం ఎక్కకుండానే యువకులు అదృశ్యం..
-ఆందోళనలో యువకుల కుటుంబ సభ్యులు..
-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబ సభ్యులు..
National updates: రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్..
జాతీయం..
-కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షేకావత్, అమిత్ షా ను కలిసిన జగన్
-మూడురాజధానుల అంశం,శాసన మండలి రద్దు ప్రక్రియ వేగవంతం చేయడం సహా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న అంశాలపై అమిత్ షా తో చర్చ
National updates: కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ముగిసిన ఏపి సీఎం జగన్ భేటీ..
జాతీయం..
-పోలవరం ప్రాజెక్ట్ తో సహా, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ ల పై చర్చ
-మరి కొద్ది సేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపి సీఎం రెండవ సారి సమావేశం
-నిన్న 53 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీ
Tirumala updates: నేడు తిరుమలకు రానున్న ఏపీ, కర్నాటక సీఎంలు..
తిరుమల..
-బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్
-రోజు సాయంత్రం తిరుమల చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
-రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్న ఇద్దరు సీఎంలు
-రేపు ఉ.8.10 గంటలకు కర్ణాటక సత్రం నూతన సముదాయ నిర్మాణానికి.
-భూమి పూజ చేయనున్న ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప
-ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అర్బన్ పోలిసులు
-ఢిల్లీ పర్యటన అనంతరం తిరుమలలో సిఎం జగన్ తో బేటి కానున్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత
-సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
-తిరుపతిలో బీజేపీ, టిడిపి నేతల ముందస్తు హౌస్ అరెస్ట్
-డిక్లరేషన్ వివాదంపై నిరసన చేపట్టే అవకాశం ఉందని పోలీసుల అంచనా
-సుగుణమ్మ, భానుప్రకాష్, సామంచి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్..
Vijayawada updates: కృష్ణానదిలో వన్ టౌన్ కు చెందిన బాల శివకుమార్(52) గల్లంతు..
విజయవాడ..
-తాడేపల్లి వద్ద నదిలోకి దిగిన శివకుమార్
-వరద ఉధృతి ఎక్కువ కావడంతో గల్లంతు అయిన శివకుమార్
-వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది
-ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు.
Kurnool District updates: పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పేకలించిన గుర్తు తెలియని దుండగులు..
కర్నూల్ జిల్లా..
-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు...
-ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్..
-హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు..
East godavari updates: ఏలేరు జలాశయానికి మళ్లీ పెరుగుతోన్న వరద ప్రవాహం..
తూర్పుగోదావరి :
-ఇన్ ఫ్లో 10 వేల 60 క్యుసెక్కులు.. అవుట్ ఫ్లో 13 వేల 952 క్యుసెక్కులు..
-ప్రాజెక్ట్ నిల్వ సామర్ధ్యం 24.11 టిఎంసిలు కాగా 22.96 టిఎంసి లకు చేరుకున్న నీటి నిల్వ..
-గత పది రోజులుగా ముంపులో ఏలేరు ప్రాజెక్జ్ దిగువ ఉన్న ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాలు..
-నీట మునిగిన వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు కాలనీలు..
-పది రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..
-గొల్లప్రోలు - పిఠాపురం మధ్య 216 జాతీయ రహదారిపై ప్రవహిస్తోన్న వరద నీరు..
Nellore District updates: సోమశిల జలాశయాని కి తగ్గిన వరద నీటి ప్రవాహం..
నెల్లూరు :--
--ఇన్ ఫ్లో 41 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 34,500 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 73.822 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు.