Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-23 02:34 GMT
Live Updates - Page 6
2020-09-23 03:46 GMT

Nellore District updates: మర్రిపాడు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్..

నెల్లూరు :--

-అక్రమంగా బద్వేలు కు తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యాన్ని అడ్డగించి, పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.

-30 బస్తాల రేషన్ బియ్యాన్ని వాహనాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.

-డ్రైవర్ తో సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

2020-09-23 03:12 GMT

Antarvedi Updates: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది నూతన రథం తయారీ పనులకు ముహూర్తం

తూర్పుగోదావరి

రాజమండ్రి: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం తయారీ పనులకు ముహూర్తం

- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ

- రావులపాలెం అడితి నుంచి ఆలయ ఆవరణకు చేరుకున్న

- రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్‌ టేకు కలప

- మొత్తం 1,330 ఘనపు అడుగుల బస్తర్‌ టేకు కలప అవసరమని లెక్కకట్టిన దేవాదాయ శాఖ డీఈ శేఖర్‌, స్తపతి శ్రీనివాసాచార్యులు

- రావులపాలెంలోని టింబర్‌ డిపో వద్ద కొనుగోలు చేసి కావాల్సిన సైజుల్లో కోయించి ఆలయానికి తరలింపు

- ఆలయం వద్దకు చేర్చిన కలపకు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన ఆలయ అర్చకులు..

- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ

- అంతర్వేది ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీసు బందోబస్తు ..పోలీసు ఆంక్షలు

2020-09-23 03:08 GMT

Anantapur Updates: నిబంధనలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల చర్యలు..

అనంతపురం:

- గతంలో ఇచ్చిన నోటీసులకు సరైన సంజాయిషీ ఇవ్వకపోవడం... మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో పలు పాఠశాలలో మూసివేయాలని ఉన్నతాధికారులకు నివేదిక.

- ధర్మవరంలో నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్రభారతి, భాష్యం పాఠశాలను మూసివేయాలని ఆర్జేడీకి నివేదిక

- అనంతపురం రామ్నగర్ లో నారాయణ పాఠశాలకు రూ.లక్ష అపరాధ రుసుం విధింపు

2020-09-23 03:07 GMT

Anantapur Updates: ఇంటర్ ప్రథమ సంవత్సరం కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు ఆన్లైన్లో పరీక్ష :ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య

అనంతపురం:

- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం

- పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో పుట్టపర్తిలో ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తాం:ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య

2020-09-23 03:04 GMT

Yedurappa: నేడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప తిరుమలకు రాక

- రూ. 200 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కర్ణాటక భవన శంకుస్థాపనకు హాజరువకానున్న సీఎం.

- ఏపీ సీఎం జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న యడియురప్ప

- కర్ణాటక నుంచి వెళ్లే భక్తులకు ఏకకాలంలో వెయ్యి మందికి సదుపాయం కల్పించే విధంగా కర్ణాటక భవన నిర్మాణానికి భూమి పూజ

- ఇవాళ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం కానున్న కర్ణాటక సీఎం.

- గురువారం ఉదయం 6:30 గంటలకు జగన్ తో కలిసి తిరుమల కు పయనం.

- శంకుస్థాపన అనంతరం 10 గంటలకు తిరుగు పయనం

Tags:    

Similar News