అమితాబ్ బచ్చన్‌కు గాయాలు.. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్ చేస్తుండగా ప్రమాదం..!
Amitabh Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌కు గాయాలయ్యాయి.
అమితాబ్ బచ్చన్‌కు గాయాలు.. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్ చేస్తుండగా ప్రమాదం..!
Amitabh Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ గాయపడ్డారు. ఆయన పక్కటెముకలకు గాయమవగా.. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.
ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం అమితాబ్ ముంబై చేరుకున్నారు. తన పక్కటెముకల్లో గాయమైందని తన బ్లాగ్‌లో రాసిన అమితాబ్.. ప్రస్తుతం ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని అంతవరకు షూటింగ్ జరగదని తెలిపారు.