Janhvi Kapoor: స్కూలు రోజుల్లోనే ఆ వెబ్‌సైట్‌లో నా ఫొటోలు పెట్టారు.. చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్న జాన్వీ

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన టీనేజ్ సమయంలో ఎదురైన బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు.

Update: 2026-04-05 11:47 GMT

Janhvi Kapoor: స్కూలు రోజుల్లోనే ఆ వెబ్‌సైట్‌లో నా ఫొటోలు పెట్టారు.. చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్న జాన్వీ

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన టీనేజ్ సమయంలో ఎదురైన బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు. డీప్‌ఫేక్, మార్ఫింగ్ వంటి టెక్నాలజీల వల్ల సినీ ప్రముఖులు ఎదుర్కొనే సమస్యలను ఆమె స్పష్టంగా వివరించారు. చిన్న వయసులోనే త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు.

స్కూల్ రోజులలోనే ఎదురైన చేదు ఘటన

జాన్వీ కపూర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఆమె స్కూల్‌లో చదువుకుంటుండగా ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో తన ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారని తోటి స్నేహితులు చెప్పడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురయ్యారట. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక చాలా బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు. స్కూల్ వాతావరణంలోనే ఇలా జరగడం తనకు భయాన్ని కలిగించిందని, ఆ సంఘటన తనను లోపల చాలా బాధపెట్టిందని జాన్వీ తెలిపారు. ఆ సమయంలోనే సోషల్ మీడియా ప్రపంచంలో నైతికత ఎంత తక్కువగా ఉంటుందో అర్థమైందని ఆమె అన్నారు.

ఇప్పటికీ డీప్‌ఫేక్ సమస్యలే

జాన్వీ కపూర్ ప్రకారం, డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల ఇప్పటికీ తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటర్నెట్‌లో ఏఐ ద్వారా తయారుచేసిన తన ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతాయ‌న్నారు. వాటిని కొన్నిసార్లు నిజమైన చిత్రాలుగా ప్రచారం చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని అధికారిక న్యూస్ పేజీలు కూడా ఆ ఫోటోలను నిజమని భావించి షేర్ చేస్తుంటాయని ఆమె వెల్లడించారు. ఆ చిత్రాల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు క‌నిపిస్తున్నాయ‌ని జాన్వీ వాపోయారు. ఈ పరిస్థితి తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంపైనా ప్రభావం చూపుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో బిజీ

సినిమాల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మ‌రి ఈ సినిమాతో జాన్వీకి తెలుగులో ఎలాంటి అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయో చూడాలి.

Tags:    

Similar News