Pochamma: పోచమ్మకి చంపడం కూడా తెలుసు.. ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్
Pochamma: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
Pochamma: పోచమ్మకి చంపడం కూడా తెలుసు.. ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్
Pochamma: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. “పోచమ్మ” పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన థ్రిల్లర్‌గా తెరకెక్కింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
ఓటీటీలు వచ్చిన తర్వాత మిస్టరీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోన్న పోచమ్మ వెబ్ సిరీస్ కూడా ఇదే జాబిలోకి వస్తుంది. గ్రామ దేవత పోచమ్మను కేంద్రంగా చేసుకుని సాగే ఈ కథలో మిస్టరీ, థ్రిల్ కలగలిపి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే విధంగా కథను తీర్చిదిద్దారు. ఈ సిరీస్‌లో ఆధ్యాత్మిక భావనలతో పాటు ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
గ్లింప్స్‌తో పెరిగిన క్యూరియాసిటీ
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథపై మరింత ఆసక్తిని పెంచాయి. గ్లింప్స్‌లో కనిపించే ఇంటెన్స్ మ్యూజిక్, మిస్టరీ వాతావరణం ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో జరిగే సంఘటనలు, దైవీయ అంశాలతో కలిసిన కథనం ఈ సిరీస్ ప్రత్యేకతగా కనిపిస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.?
“పోచమ్మ” వెబ్ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత శ్రుతి నాయుడు తన బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌కు రమేష్ ఇంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కథలో ప్రధాన పాత్రల్లో రమేష్ ఇంద్ర, ప్రియా శతమర్షన్, శ్రుతి నాయుడు నటిస్తున్నారు. సంగీతాన్ని ఎల్.వి. ముత్తు గణేష్ అందిస్తున్నారు. మిస్టరీతో పాటు దైవిక నేపథ్యాన్ని కలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా ఉంటుందని టీమ్ చెబుతోంది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది.