Biker Twitter Review: శర్వానంద్ ‘బైకర్’ ట్విట్టర్ రివ్యూ ..ఆడియన్స్ ఏమంటున్నారంటే?

Biker Twitter Review: శర్వానంద్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'బైకర్' థియేటర్లలో సందడి చేస్తోంది.

Naresh.k
Published on: 3 April 2026 9:40 AM IST
Biker Twitter Review Sharwanand Racing Drama Wins Hearts
X

Biker Twitter Review

Biker Twitter Review: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్' నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రచారం పొందిన ఈ చిత్రంపై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ రేసింగ్ డ్రామాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

హై-ఆక్టేన్ యాక్షన్.. అదిరిపోయిన విజువల్స్

సినిమా చూసిన ప్రేక్షకులు ముఖ్యంగా ఇందులోని రేసింగ్ సీక్వెన్సుల గురించి గొప్పగా చెబుతున్నారు. శర్వానంద్ బైకర్ గెటప్‌లో అదరగొట్టారని, మోటోక్రాస్ రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. యువతను కట్టిపడేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.

తండ్రీకొడుకుల ఎమోషన్.. సినిమాకు హైలైట్!

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో ఎమోషనల్ బాండింగ్ కూడా బాగా వర్కవుట్ అయిందని ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్స్ గుండెకు హత్తుకునేలా ఉన్నాయని, ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పిస్తాయని రివ్యూలు ఇస్తున్నారు. శర్వానంద్ నటన మరోసారి సినిమాకు ప్రాణం పోసిందని ప్రశంసలు దక్కుతున్నాయి.

అండర్ రేటెడ్ అనొద్దు

నెట్టింట వైరల్ అవుతున్న రివ్యూల ప్రకారం.. సినిమా చాలా బాగుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చాక అండర్ రేటెడ్ మూవీ అనడం కంటే, ఇప్పుడే థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అంటూ కొందరు సినీ ప్రియులు సలహా ఇస్తున్నారు. ఒక కొత్త జోనర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన చిత్ర బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్లేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








Naresh.k

Naresh.k

Next Story