Rashmika Mandanna: 'మేము ముగ్గురమయ్యాం'.. రష్మిక మందన్న సంచలన పోస్ట్..!
Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Rashmika Mandanna: 'మేము ముగ్గురమయ్యాం'.. రష్మిక మందన్న సంచలన పోస్ట్..!
Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా ఒక మిస్టరీ పోస్ట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు.
వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ఏంటి?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఒక యానిమేషన్ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. అందులో "ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం" (Now we are three) అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో విజయ్, రష్మికలతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు ఉండటం, రష్మిక ధరించిన టీ-షర్ట్‌పై గుడ్డు (Egg) బొమ్మ ఉండటం విశేషం. ఈ చిన్న క్లిప్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తల్లి కాబోతోందా? నెటిజన్ల ప్రశ్నలు:
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. "రష్మిక తల్లి కాబోతోందా?", "త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?", "ఆ మూడో వ్యక్తి ఎవరు?" అంటూ కామెంట్లతో రష్మికను ముంచెత్తుతున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కు బదులుగా 'బడ్డీమూన్' (స్నేహితులతో కలిసి విహారయాత్ర) వెళ్లిన ఈ జంట, ఇంత త్వరగా ఇలాంటి అప్‌డేట్ ఇవ్వడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సస్పెన్స్ కొనసాగుతోంది..
అయితే, రష్మిక ఉద్దేశం ఏంటి? అది నిజంగానే ప్రెగ్నెన్సీ గురించిన హింటా లేక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా బ్రాండ్ ప్రమోషన్‌కు సంబంధించిన ప్రకటనా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. రష్మిక స్వయంగా స్పందిస్తే తప్ప ఈ 'ముగ్గురు' వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడదు. ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.