OTT: శ‌వంతో ప్ర‌యాణం.. ఊహ‌కంద‌ని ట్విస్టులు. ఓటీటీలోకి వ‌స్తోన్న‌ ఇంట్రెస్టింగ్ మూవీ

OTT: నటుడు శివాజీ, నటి లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

Update: 2026-04-01 10:43 GMT

OTT: శ‌వంతో ప్ర‌యాణం.. ఊహ‌కంద‌ని ట్విస్టులు. ఓటీటీలోకి వ‌స్తోన్న‌ ఇంట్రెస్టింగ్ మూవీ

OTT: నటుడు శివాజీ, నటి లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాకు దర్శకుడు సుధీర్ శ్రీరామ్. నటుడు శివాజీ స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకుందీ మూవీ. కథలోని ఉత్కంఠభరిత మలుపులు, కుటుంబ నేపథ్యం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా థ్రిల్లర్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ప్రధాన పాత్రల్లో శివాజీ, లయ

ఈ చిత్రంలో శివాజీ శ్రీరామ్ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన భార్యగా లయ ఉత్తర పాత్రలో నటించారు. వారి కుమారుడి పాత్రలో రోహన్ కనిపిస్తాడు. అలాగే ప్రిన్స్, శరత్ లోహితాశ్వ, ధనరాజ్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. కుటుంబం చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్రకు కథకు ద‌ర్శ‌కుడు ప్రాధాన్య‌త ఇచ్చారు.

క‌థేంటంటే.?

కథలో శ్రీరామ్ ఒక నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి. ఆయన హార్స్‌లీహిల్స్ సమీపంలోని కొత్తకోట గ్రామంలో భార్య ఉత్తర, కొడుకు బిట్టుతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. అయితే సోషల్ మీడియా రీల్స్ మీద ఆసక్తి ఉన్న తన కొడుకు చేసే పనులు అప్పుడప్పుడు కుటుంబానికి సమస్యలు తెస్తుంటాయి.

ఒక దీపావళి రోజున ఊరి ఎస్సై విక్రమ్ వాసుదేవ్ వారి ఇంటికి వస్తాడు. అతనికి ముందు నుంచే శ్రీరామ్‌తో విభేదాలు ఉంటాయి. అదే సమయంలో ఇంట్లో శ్రీరామ్ లేని సమయంలో ఉత్తరపై దురుద్దేశంతో విక్రమ్ ప్రవర్తించడం కథను కీలక మలుపు వైపు నడిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో అనూహ్యంగా ఎస్సై విక్రమ్ హత్యకు గురవుతాడు. ఆ ఘటనకు శ్రీరామ్ కుమారుడు సంబంధం ఉన్నట్టు కనిపించడం కథను మరింత ఉత్కంఠగా మారుస్తుంది.

హత్య తర్వాత జరిగే సంఘటనలు

ఆ సంఘటన తర్వాత శ్రీరామ్ కుటుంబం పెద్ద సంక్షోభంలో పడుతుంది. హత్య కేసు బయటకు రాకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ చేసే ప్రయత్నాలు కథలో కీలకంగా మారతాయి. శవాన్ని ఎలా దాచారు? ఆ రహస్యాన్ని ఎవరూ తెలుసుకోకుండా ఉండేందుకు వారు పడిన ఇబ్బందులు ఏమిటి? అన్న అంశాలు సినిమా మొత్తం ఉత్కంఠగా సాగుతాయి.

ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే తిమ్మప్ప గ్యాంగ్ కూడా కథలోకి ప్రవేశిస్తుంది. కోటి రూపాయల నగదు ఉన్న గిఫ్ట్ బ్యాగ్ కనిపించకుండా పోయిందని అనుమానంతో వారు శ్రీరామ్ కుటుంబాన్ని వెంబడించడం మరో టెన్షన్ సృష్టిస్తుంది. చివ‌రికి ఏమైంది.? నిజంగా ఆ హ‌త్య చేసింది ఎవ‌రు.? లాంటి విష‌యాలు తెలియాంటే సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News