OTT Release: చడీ చప్పుడు లేకుండా ఓటీటీకి వచ్చేసిన సుహాస్ ‘హే బల్వంత్’...

OTT Release: సుహాస్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ హే బల్వంత్ మార్చి 31, 2026 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిక్స్‌డ్ స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో పలు భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

Update: 2026-03-31 06:38 GMT

OTT Release: చడీ చప్పుడు లేకుండా ఓటీటీకి వచ్చేసిన సుహాస్ ‘హే బల్వంత్’...

OTT Release:తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన కథలు, సహజమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'సుహాస్' తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం హే బల్వంత్. విడుదలకు ముందే ట్రైలర్ తో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా చివరి నిమిషంలో టైటిల్‌ను హే భగవాన్ నుంచి హే బల్వంత్ మార్చడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దర్శకుడు గోపి ఆచంట తెరకెక్కించిన ఈ సినిమాలో సుహాస్ తనకు అలవాటైన సహజమైన పాత్రలకంటే కొంచెం భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నించాడు. కథలో కొత్తదనం ఉండటం, ప్రెజెంటేషన్‌లో కొంత ప్రత్యేకత కనిపించినా, థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే లభించింది. కొంతమంది ప్రేక్షకులు సినిమా భావోద్వేగాలను మెచ్చుకోగా, మరికొందరు కథనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో పరిమితమైన ఈ సినిమా, మార్చి 31 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండటం విశేషం. హిందీ వెర్షన్ త్వరలో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శివాని నాగారం నటించగా, కీలక పాత్రలో నరేష్ తనదైన సహజ నటనతో మెప్పించారు. అలాగే వెన్నెల కిశోర్, సుధర్శన్, బాబు మోహన్, అన్నపూర్ణ తమ తమ పాత్రల్లో మెప్పించారు. త్రిషుల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని వివేక్ సాగర్ అందించారు.

Tags:    

Similar News