Mrithyunjay OTT Release:శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Mrithyunjay OTT Release:శ్రీ విష్ణు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఏప్రిల్ 3 నుండి Netflix లో స్ట్రీమింగ్‌కు వస్తోంది. థియేటర్లలో మిక్స్‌డ్ స్పందన పొందిన తర్వాత, ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Mrithyunjay OTT Release:టాలీవుడ్‌లో తనదైన కథలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు 'శ్రీ విష్ణు' ఇటీవల మృత్యుంజయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదలైంది. కథ, నటనపై మంచి బజ్ వినిపించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని, ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
మృత్యుంజయ్ కథ:
మృత్యుంజయ్ (శ్రీ విష్ణు) హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. ఎవరైనా చనిపోతే, వేర్వేరు వేషాలు వేసుకుని వారి ఇళ్లకు వెళ్లి, కుటుంబ సభ్యులను ఒప్పించి పేపర్‌లో ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ ఇవ్వించడమే అతని పని. అయితే అతని అసలు కల మాత్రం క్రైమ్ రిపోర్టర్ కావడం. ఒక రోజు ఒక చిన్న పాప ద్వారా అతనికి ఓ కేసుపై అనుమానం కలుగుతుంది. ఆ పాప తండ్రి మరణం సహజం కాదని, అది ప్లాన్ చేసిన హత్య అని అతను అనుమానిస్తాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీత (Reba Monica John) దృష్టికి తీసుకెళ్తాడు. మొదట అతన్ని సీరియస్‌గా తీసుకోని ఆమె, తరువాత అతనిపై జరిగిన హత్యాయత్నం తర్వాత విషయం నిజమే అయి ఉండొచ్చని భావిస్తుంది. అయితే నిజంగా అది హత్యేనా? లేక సాధారణ ప్రమాదమా? చివరకు మృత్యుంజయ్ ఏం నిజం బయటపెట్టాడు? అనేది కథ
దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రెబ్బ మోనికా జాన్ నటించగా, ప్రతినాయకుడి పాత్రలో వీర్ ఆర్యన్ కనిపించారు. బేబీ ఉహా, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంగీతాన్ని కాల భైరవ అందించారు. థియేటర్లలో మిస్ అయిన వారిని ఈ సినిమా, ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.