Peddi Vs Toxic : జూన్ లో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ?
Peddi Vs Toxic : జూన్ నెలలో బాక్సాఫీస్‌లో భారీ క్లాష్ చూడవచ్చు, ఎందుకంటే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మరియు రాకింగ్‌స్టార్ యష్ హీరోగా వచ్చిన టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్‌స్ రెండు సినిమాలు ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ కానున్నాయి.
Peddi Vs Toxic : జూన్ లో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ?
Peddi Vs Toxic :మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్-డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని అనూహ్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడటంతో, రిలీజ్ డేట్ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. తాజాగా వస్తున్న పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ కూడా ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ తోనే వస్తున్నాయి. కానీ, తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ది జూన్‌లో రిలీజ్ కావచ్చని చర్చలు మొదలైపోయాయి. మేకర్స్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ వాయిదా ఖరారు అనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ కానుందని ఆ డేట్ కి అనుకున్న ఇతర సినిమాలన్నీ వాయిదా పడగా, ఇప్పుడు పెద్ది కూడా వాయిదా పడితే రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం మరింత పెరుగుతుంది.
ఇదే సమయంలో జూన్‌లో మరో భారీ పాన్-ఇండియా చిత్రం, రాకింగ్‌స్టార్ 'యష్' హీరోగా నటిస్తున్న టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. యష్ యొక్క బాడీ లాంగ్వేజ్, లుక్స్ మునుపెన్నడూ చూడని విధంగా వైల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కావాల్సినది, కానీ మిడ్-ఈస్ట్ పరిస్థితుల కారణంగా జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో వస్తే బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొదట నుంచే భారీ సినిమాలు సొలో రిలీజ్ కోసం ముందే డేట్ ప్రకటిస్తాయి, కానీ ఆ డేట్ రిలీజ్ చేయలేకపోతే ఇలాగే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.