సైలేష్ కొలను చేతుల మీదుగా “ఏంటో అంతా సరికొత్తగా” ఫస్ట్ లుక్ రిలీజ్!

Ento Antha Sarikothaga: ప్రముఖ దర్శకుడు సైలేష్ కొలను చేతుల మీదుగా “ఏంటో అంతా సరికొత్తగా” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

Update: 2026-03-30 11:46 GMT

సైలేష్ కొలను చేతుల మీదుగా “ఏంటో అంతా సరికొత్తగా” ఫస్ట్ లుక్ రిలీజ్!

Ento Antha Sarikothaga: “రాము ప్రొడక్షన్స్” బ్యానర్‌పై రాము.ఎం నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం “ఏంటో అంతా సరికొత్తగా”. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ సైలేష్ కొలను సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.

ఫస్ట్ లుక్ విడుదల చేసిన అనంతరం సైలేష్ కొలను చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "పోస్టర్ చూడగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, ఈ సినిమా ఆ దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. దర్శకుడు రాజ్ బోను ఈ కథను మలిచిన తీరు ఆసక్తికరంగా ఉంది. నిర్మాత రాము గారు మంచి కంటెంట్‌ను ప్రోత్సహించడం అభినందనీయం" అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి రాజ్ బోను కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు ఒక కొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.

సాంకేతిక నిపుణుల బృందం:

నిర్మాత: రాము.ఎం

సంగీతం: రిషి.ఎం

సినిమాటోగ్రఫీ: వేణు కొత్తకోట

ఎడిటింగ్: హరీష్ జె.ఆర్ కృష్ణ

సాహిత్యం: భాస్కర్ బట్ల, రాకెందు మౌళి, అనిరుద్ శాండిల్య

మాటలు: సాయి సూర్య రావూరి

ఆర్ట్: వెంకట్ మేడిశెట్టి

Tags:    

Similar News