Naga Shaurya : నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్స్‌లో సందడి అప్పుడే!
మెలోడీ కింగ్ హారిస్ జయరాజ్ సంగీతం, నాగశౌర్య మాస్ యాక్షన్.. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
Naga Shaurya : టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ విడుదలకు రెడీ అవుతుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంతో రామ్ దేసి డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెలోడీ కింగ్ హారిస్ జయరాజ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన అందించిన సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే థియేటర్స్‌లోకి వస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.