Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలపై నీలినీడలు.. మరోసారి వాయిదా తప్పదా?
Peddi Release Date: రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' చిత్రం.. ఇప్పటికే అధికారికంగా ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తేదీపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలపై నీలినీడలు.. మరోసారి వాయిదా తప్పదా?
Ram Charan's Peddi Release Date: 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' చిత్రం.. ఇప్పటికే అధికారికంగా ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తేదీపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ తేదీలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 8వ తేదీకి మార్చారు. సాంకేతిక కారణాల వల్ల ఈ మార్పు జరిగిందని చెబుతున్నప్పటికీ.. సాధారణంగా బుకింగ్స్ వెనక్కి వెళ్లాయంటే సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
షూటింగ్ బ్యాలెన్స్:
పెద్ది సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. దీనికి తోడు భారీ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉందట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ సినిమాను మే 21కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ పట్టుదల:
మరోవైపు హీరో రామ్ చరణ్ పెద్ది సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇటీవల ఆయనకు కంటి గాయమైనప్పటికీ.. ఏమాత్రం విరామం తీసుకోకుండా తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. చిత్ర యూనిట్ కూడా ఏప్రిల్ 30 నాటికే సినిమాను సిద్ధం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకవేళ అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోతే.. మే నెలకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
స్పెషల్ సర్‌ప్రైజ్:
పెద్ది సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. శుక్రవారం ఉదయం 11.07 గంటలకు స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.