Dhurandhar 2 Week 1 collections: వారం రోజుల్లో వెయ్యికోట్లు..తిరుగులేని దురంధర్ 2
Dhurandhar 2 Week 1 collections: దురంధర్ 2 మూవీ ప్రభంజనం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. వారం రోజుల్లో వెయ్యికోట్లు దాటిన కలెక్షన్లు
Dhurandhar 2 Week 1 collections
Dhurandhar 2 Week 1 collections: థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అంటేనే ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి. సినిమాలో ఎంతో విషయం ఉంటేనే కానీ థియేటర్ల వైపు జనం రావడం లేదిప్పుడు. అలాంటిది వారం రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. బాక్సాఫీసు మీద అది పెద్ద దండయాత్ర అనే చెప్పాలి. అదిగో అలాంటి దండయాత్రనే రణవీర్ సింగ్-ఆదిత్య ధర్ చేశారు. వీరిద్దరి దురంధర్ 2 మూవీ వారం రోజుల్లో వెయ్యికోట్ల రూపాయల కలెక్షన్స్ దాటి రికార్డ్ సృష్టించింది. భారత చలన చిత్ర చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప మూవీ ఈ రికార్డులో మొదటి స్థానంలో ఉంది.
'ధురందర్ 2' విడుదలైన దగ్గర నుంచి ఒక రేంజిలో దూసుకుపోతోంది. నెగెటివ్ టాక్ అనేది వినిపించని సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. రాజకీయంగా అక్కడక్కడా మూవీపై ట్రోల్స్ జరుగుతున్నా.. అవి కూడా పెద్ద లెక్కలోకి రాకుండా పోయాయి. మొదటి వారంలో మూవీ మంచి వసూళ్లను సాధించింది. ఈ మూవీ అన్ని ప్రాంతాల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా రెండు భాషల్లోనూ అదిరిపోయే రేంజిలోనే ఉన్నాయి. దురంధర్ 2 మూవీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి వారంలోనే రూ.1,006 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇది అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది.
పుష్ప 2 తరువాత..
అత్యంత వేగంగా వెయ్యి రూపాయల క్లబ్‌లో చేరిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఏడు రోజుల్లోనే ఏకంగా రూ. 1067 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ సినిమా నెలకొల్పిన రికార్డును దురంధర్ 2 ఇంకా బద్దలు కొట్టలేకపోయింది. మొత్తం వసూళ్ల పరంగా 'పుష్ప 2' రికార్డును 'ధురందర్ 2' బద్దలు కొడుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.
అందుకే వెనుకబడింది..
నిజానికి దురంధర్ 2 కలెక్షన్స్ పుష్ప 2 కంటే వెనుకపడటానికి రెండు కారణాలున్నాయి. రీజినల్ లాంగ్వేజెస్ లో మూవీ రెండు రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఇక గల్ఫ్ కంట్రీస్ లో ఈ మూవీ రిలీజ్ పై నిషేధం ఉంది. దీంతో భారతీయ హిందీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. అందువల్ల దురంధర్ 2 మూవీ పుష్ప 2 కు కొద్దిదూరంలో ఆగిపోయింది. కానీ, థియేట్రికల్ రన్ ముగిసేసరికి పుష్ప 2 రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'ధురందర్ 2' సినిమా బుధవారం (మార్చి 25) నాడు రూ. 47 కోట్లు వసూలు చేసింది. ఇది ఏ సినిమాకైనా మొదటి బుధవారం అత్యధిక కలెక్షన్స్. వీకెండ్ కాకపోయినా.. వర్కింగ్ డేస్ లో కూడా దురంధర్ 2 కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలోనే రావడం గమనార్హం. ఈ వారాంతంలో, ఈ సినిమా ప్రతిరోజూ రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ చూపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా రణ్‌వీర్ సింగ్ భారీ విజయాన్ని అందుకున్నాడు.