Varanasi-Rajamouli : రాజమౌళి వాట్ ఏ విజన్‌, అచ్చం కాశీ నగరంలానే.. ఇండియన్ సినిమాకు మరో కొత్త బెంచ్‌మార్క్‌!

Varanasi-Rajamouli : దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2026-03-25 11:39 GMT

Varanasi-Rajamouli : రాజమౌళి వాట్ ఏ విజన్‌, అచ్చం కాశీ నగరంలానే.. ఇండియన్ సినిమాకు మరో కొత్త బెంచ్‌మార్క్‌!

Varanasi-Rajamouli :దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సూపర్ స్టార్' మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంతో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆయన ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా.. రాజమౌళి అత్యంత శ్రద్ధతో షూట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వారణాసి నేపథ్యాన్ని పునర్నిర్మించిన మినియేచర్ సెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పురాతన నగరం వారణాసిలో షూటింగ్ నిర్వహించడం చాలా కష్టసాధ్యమైన పని. అక్కడి జన సంచారం, ప్రదేశాల పరిమితులు, లాజిస్టికల్ సమస్యలు వంటి కారణాల వల్ల చిత్రీకరణకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి టీమ్ వినూత్న నిర్ణయం తీసుకుని.. వారణాసి నగరాన్ని భారీ సెట్స్ రూపంలో పునర్నిర్మిస్తున్నారు. ఈ సెట్స్‌లో వారణాసి ప్రత్యేకత అయిన ఘాట్లు, ఆలయాలు, ఇరుకైన వీధులు అన్నీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి చిన్న వివరాన్నీ పట్టించుకుంటూ.. కాశీ నగర ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలాగే ప్రతిబింబించేలా డిజైన్ చేస్తున్నారు. ఈ సెట్స్ కేవలం సినిమా కోసం నిర్మించినవి కాకుండా.. ఒక రియలిస్టిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించేలా రూపొందుతున్నాయి.

వారణాసిని అచ్చుగుద్దినట్లు చూపించేలా దాదాపు 700x400 అడుగుల విస్తీర్ణంలో భారీ సెట్‌ను నిర్మించారు. వేల సంఖ్యలో రిఫరెన్స్ చిత్రాలను, కచ్చితమైన కొలతలను వాడారట. ఈ సెట్‌లో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. నిజమైన ఆలయ గోపురం వంపు తిరిగి ఉండగా.. ఈ సెట్‌లో ఆ ఆలయాన్ని కూడా అదే కోణంలో, అదే ఎత్తులో రూపొందించారు. నిర్మాణ సమయంలో ఏ చిన్న అలంకరణను, శిల్ప కళలను వదలకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారణాసి కథ త్రేతాయుగం నుంచి 2027 వరకూ సాగనున్నట్లు సమాచారం. అందుకే వారణాసి నగరం కాలక్రమేణా ఎలా మారిందో చూపించడానికి సెట్‌లో ప్రత్యేక మార్పులు చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతున్న వారణాసి చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. రాజమౌళి విజన్, టెక్నికల్ గ్రాండియర్, భారీ సెట్స్.. అన్ని కలిపి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వారణాసి కోసం రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఇండియన్ సినిమాకు మరో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచేలా కనిపిస్తోంది. అభిమానులు ఈ విజువల్ వండర్‌ను వెండి తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



 


Tags:    

Similar News