Ram Charan : 'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్‌కు ప్రమాదం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్‌లో గాయపడ్డారు.
Ram Charan : 'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్‌కు ప్రమాదం
Ram Charan Injured : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పెద్ది' (Peddi) ప్రాజెక్టులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో మెగా అభిమానులను కలవరపెట్టే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్‌కు గాయమైంది.
కంటికి గాయం.. అసలేం జరిగింది?
గత కొన్ని రోజులుగా చిత్రబృందం స్టేడియం వేదికగా క్లైమాక్స్ లేదా కీలకమైన కుస్తీ పోటీలకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలోనే ఒక యాక్షన్ సీన్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటి పైన స్వల్ప గాయమైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.
వైద్యుల సూచన.. రెండు రోజులు విశ్రాంతి
ఈ వార్త సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. చరణ్‌కు తగిలిన గాయం చాలా స్వల్పమైనది. కంగారు పడాల్సిన పని లేదని, కేవలం రెండు రోజుల పాటు కంటికి విశ్రాంతిని ఇస్తే సరిపోతుందని వైద్యులు సూచించారట. దీంతో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి, చరణ్ కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఏప్రిల్ 30 లక్ష్యం.. తగ్గేదే లే
నిజానికి 'పెద్ది' సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీని ఏప్రిల్ 30, 2026కు వాయిదా వేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే పట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు మరియు చరణ్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ చిన్నపాటి గాయం వల్ల విడుదల తేదీపై ఎలాంటి ప్రభావం ఉండదని, ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బర్త్‌డే ట్రీట్ కుస్తీ టీజర్ లోడింగ్
మరోవైపు, మార్చి 27న (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోందనే వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. 'కుస్తీ' పేరుతో రానున్న ఈ టీజర్‌లో చరణ్ తన రగ్గడ్ లుక్ , మేకోవర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. గాయాలను లెక్కచేయకుండా సినిమా కోసం ప్రాణం పెట్టే రామ్ చరణ్, త్వరగా కోలుకొని మళ్లీ అదే ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.