Brahmanandam: 'రెహమాన్ డికాయిట్'తో మీమ్స్ గాడ్ భేటీ.. వైరల్ అవుతున్న క్రేజీ ఫోటో!
టాలీవుడ్ హాస్య దిగ్గజం బ్రహ్మానందం ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాని కలిశారు. 'ధురంధర్ 2'లో 'రెహమాన్ డికాయిట్'గా అందరి మనసు గెలుచుకుంటున్న అక్షయ్ ఖన్నా బ్రహ్మానందం ఎందుకు కలిశారో ఈ స్టోరీలో చదవండి.
Brahmanandam: 'రెహమాన్ డికాయిట్'తో మీమ్స్ గాడ్ భేటీ.. వైరల్ అవుతున్న క్రేజీ ఫోటో!
ప్రస్తుతం సినీ ప్రపంచమంతా ‘ధురంధర్ 2’ మేనియాతో ఊగిపోతోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ నటన ఒక ఎత్తయితే, విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా పండించిన ‘రెహమాన్ డికాయిట్’ మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ ‘రెహమాన్’ను మన తెలుగు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కలవడం విశేషం.
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్..
అక్షయ్ ఖన్నాతో దిగిన ఫోటోను బ్రహ్మానందం తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు "లెజెండ్ విత్ ది విలన్ ఆఫ్ ది ఇయర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా అలరించిన అక్షయ్ ఖన్నాకు, ఈ ‘రెహమాన్’ పాత్ర సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నప్పటికీ, ఆయన మాత్రం చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు మీమ్స్ గాడ్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తన మనసుకు నచ్చిన, ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
వీరిద్దరి భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదా? లేక రాబోయే ఏదైనా భారీ ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారా? అన్నది ఇప్పుడు సినీ సర్కిల్‌లో ఆసక్తికరంగా మారింది. ‘ధురంధర్ 2’ విజయోత్సవాల్లో భాగంగా లేదా ఏదైనా కొత్త సినిమా చర్చల నిమిత్తం వీరిద్దరూ కలిసి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, టాలీవుడ్ హాస్య దిగ్గజం, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులను మస్త్ ఖుషీ చేస్తుంది.