Dhurandhar 2: రూ.2000 కోట్ల వైపు ఇండియన్ సినిమా.. ‘ధురంధర్ 2’తో కొత్త ట్రెండ్‌కు నాంది!

Dhurandhar 2: ధురంధర్ 2 సునాయాసంగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బాహుబలి, పుష్ప సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో రూ.2000 కోట్ల కలెక్షన్ ఇప్పుడు బిగ్ సినిమాలకు సునాయాస లక్ష్యంగా మారింది.

Update: 2026-03-22 13:54 GMT

Dhurandhar 2: రూ.2000 కోట్ల వైపు ఇండియన్ సినిమా.. ‘ధురంధర్ 2’తో కొత్త ట్రెండ్‌కు నాంది!

Dhurandhar 2: భారతీయ సినిమా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రిలీజైన ‘ధురంధర్: ది రివెంజ్’ విజయంతో బాక్సాఫీస్ లెక్కలు సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. ధురంధర్ 2 మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500+ కోట్లు వసూలు చేసింది. సీక్వెల్‌కు మూడో రోజు నుంచి తెలుగు, తమిళం, మలయాళం యాడ్‌ కావడం కలిసొచ్చే అంశం. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ధురంధర్ 2 సునాయాసంగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బాహుబలి, పుష్ప సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో రూ.2000 కోట్ల కలెక్షన్ ఇప్పుడు బిగ్ సినిమాలకు సునాయాస లక్ష్యంగా మారింది. దాంతో ఇండియన్ సినిమా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ధురంధర్ 2 సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్ లేకుండానే ఇంత పెద్ద వసూళ్లు సాధించడం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ విజయంతో ఈవెంట్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇదే ట్రెండ్‌ను అనుసరించి రాబోయే భారీ ప్రాజెక్టులు కూడా భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా సుమారు రూ.1400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800-2000 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది.

నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, యష్ కలిసి నటిస్తున్న సినిమా ‘రామాయణం’. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమా 2026 దీపావళికి (నవంబర్ 8) మొదటి భాగం విడుదల కానుండగా.. రెండో భాగం 2027లో రానుంది. మొత్తం రూ.4000 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ప్రతి భాగం రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేలా ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ కింగ్ షారుక్‌ ఖాన్‌, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కింగ్’ సినిమా కూడా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తోంది. ఈ చిత్రం రూ.1200 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా రూ.800 నుంచి 1000 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు రూ.1000 కోట్ల బెంచ్‌మార్క్ దాటిపోయి రూ.2000 కోట్ల లక్ష్యం వైపు అడుగులు పడుతున్నాయి. భారీ బడ్జెట్, భారీ అంచనాలు, గ్లోబల్ మార్కెట్.. అన్ని కలిసి ఇండస్ట్రీని “హై రిస్క్ – హై రివార్డ్” దశలోకి తీసుకెళ్తున్నాయి. ఇకపై మెగా బ్లాక్‌బస్టర్ల యుగం ప్రారంభమైందని చెప్పాలి.

Tags:    

Similar News