Dhurandhar The Revenge: 'ధురంధర్ 2' సక్సెస్‌పై బాలీవుడ్ క్వీన్ షాకింగ్ కామెంట్స్!

Dhurandhar The Revenge: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' రికార్డుల వేట కొనసాగుతుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌పై బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-22 14:01 GMT

Dhurandhar The Revenge: 'ధురంధర్ 2' సక్సెస్‌పై బాలీవుడ్ క్వీన్ షాకింగ్ కామెంట్స్!

Dhurandhar The Revenge: కంటెంట్‌లో దమ్ముంటే సినిమా 4 గంటల నిడివి ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని దర్శకుడు ఆదిత్య ధర్ నిరూపించారు. ఆయన తాజాగా తెరకెక్కించిన 'ధురంధర్: ద రివెంజ్' (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. హిందీ సినిమాను గ్లోబల్ లెవల్‌లో ప్రెజెంట్ చేసిన విధానంపై, ఆదిత్య ధర్ స్టోరీ టెల్లింగ్‌కు సామాన్య జనాల నుంచి, సెలబ్రేటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ సినిమా సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

డైరెక్టర్లే అసలైన సూపర్ స్టార్లు

సినిమా విజయం వెనుక ఉన్న అసలైన శక్తి ఆదిత్య ధర్ అని కంగనా సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు.. "ధురంధర్ సక్సెస్‌లో బెస్ట్ పార్ట్ ఎవరంటే అది ఆదిత్య ధర్. ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్, స్పిల్బర్గ్ వంటి దర్శకులు అక్కడి సూపర్ స్టార్ హీరోల కంటే గొప్ప గౌరవం పొందుతారు. కానీ మన దగ్గర ఫిలిం మేకర్లకు తగినంత క్రెడిట్ ఇవ్వము" అని పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ లో దర్శకులు, టెక్నీషియన్ల పరిస్థితిపై కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. "దర్శకులు హీరోల కంటే ఎక్కువ కష్టపడతారు, తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. పైగా సూపర్ స్టార్ హీరోల చేతిలో వేధింపులకు గురి అవుతారు. దీనివల్ల నేటి యువతలో ఎవరూ టెక్నీషియన్లుగా లేదా డైరెక్టర్లుగా మారాలని అనుకోవడం లేదు. అందరూ కేవలం నటులే కావాలనుకుంటున్నారు. కానీ, ఆదిత్య ధర్ ఇప్పుడు ఏ హీరో కంటే తక్కువ కాకుండా మెరిసిపోతున్నారు. ఆయనను చూసి ఎంతోమంది యువత దర్శకులు కావాలని స్ఫూర్తి పొందుతారు" అంటూ ఆదిత్య ధర్ ను కొనియాడారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ వంటి భారీ స్టార్ కాస్ట్ నటించారు. నిడివి ఎక్కువ ఉన్నా సరే, ఆదిత్య ధర్ మేకింగ్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ వైపు నడిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు.

Tags:    

Similar News